NTR : తెలుగు వారి ఆరాధ్య దైవంగా మారిన నందమూరి తారకరామారావు గురువు ఎవరో తెలుసా !

October 19, 2021 9:42 AM

NTR : తెలుగు సినీ చరిత్రకే ఆయనొక నట సార్వభౌముడు. నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతగా మూడు వందలకు పైగా సినిమాలు తెరకెక్కించి తెలుగునాట ప్రేక్షకులను మెప్పించి అలరించారు. రాముడు.. కృష్ణుడు.. అంటే ఇలాగే ఉంటారేమో అనే భావం ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. అంతటి ఘనతను సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అందుకు పెద్దల ఆశీర్వచనాలే కారణం.

do you know about sr NTR guru

నటనలో.. భావ వ్యక్తీకరణలో తీర్చిదిద్దిన గురువులకు ఎంత చేసినా తక్కువే. ఎన్టీఆర్ కు తెలుగు భాష మీద పట్టు ఉండేది. తెలుగును ఆయన ఎంతగానో ప్రేమించేవారు. కాలేజీ రోజులలో తెలుగు పాఠాలు నేర్పిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.

ఆయన జ్ఞానపీఠ అవార్డు విజేత. సాహితీ మూర్తి, ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆయన నిలువెత్తు రూపంగా నిలిచారు. అలాంటి గురువు ప్రోత్సాహంతో ఎన్టీఆర్ నాయకురాలు నాగమ్మ నాటకంలో నాగమ్మగా పాత్రను పోషించారు. అలా ఎన్నో మెళకువలను ఎన్టీఆర్ గురువు నుండి నేర్చుకున్నవే. అందుకే ఆయనంటే ఎన్టీఆర్ కు ఎంతో మక్కువ. విశ్వనాథ రచించిన నవల ఏకవీర సినిమాలో ఎన్టీఆర్ కథనాయకుడు. సినిమా ఫంక్షన్లు అయినా సరే విశ్వనాథ సత్యనారాయణ నిలయం ఉన్న విజయవాడలోనే పెట్టేవారు.

ఆయనను ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పిలిచి సత్కరించేవారు. ఘంటసాల చివరి రోజుల్లో గానం చేసిన భగవద్గీత గ్రామ ఫోన్ రికార్డ్స్ ని ఆవిష్కరించడానికి ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తే.. విజయవాడలో ఆ కార్యక్రమం నిర్వహించాలని అడిగారు. అలా భగవద్గీత మొదటి రికార్డ్ ని ఆయన గురువు విశ్వనాథకి ఇవ్వాలనేది ఎన్టీఆర్ ఆశ. అలా ప్రతి విషయంలోనూ విశ్వనాథపై శిష్య వాత్సల్యం చూపిస్తూ.. ఎన్టీఆర్ గురుభక్తిని నిరూపించుకున్నారు. ఆయన దివంగతులు అయ్యేవరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అందుకే తెలుగు వారి గుండెల్లో నందమూరి తారక రామారావు అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment