Anasuya Kota Srinivasa Rao : అన‌సూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై కోట సెన్సేష‌న‌ల్ కామెంట్స్..!

October 19, 2021 8:08 AM

Anasuya Kota Srinivasa Rao : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ బుల్లితెర‌కు గ్లామ‌ర్ అద్ద‌డ‌మే కాకుండా వెండితెర‌పై అందాలు ఆర‌బోస్తూ ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకుంది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయి అందరినీ ఆకట్టుకుంది అనసూయ. ఈ సినిమా అనంతరం వెండితెరపై అనసూయ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్ర‌స్తుతం అన‌సూయ‌కు ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాయి.

Anasuya Kota Srinivasa Rao controversial comments on her dressing style

ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయినా కూడా అన‌సూయ త‌న గ్లామ‌ర్ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. సోషల్‌ మీడియాలోనూ హాట్‌ ఫోటో షూట్‌లతో రెచ్చిపోయే అనసూయ టీవీ షోలతోపాటు సినిమాల్లోనూ గ్లామ‌ర్ షోతో రెచ్చిపోతుంటుంది. కొంద‌రు ఆమె అందాల ఆర‌బోత‌ని ఆస్వాదిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం దీనిని త‌ప్పుబ‌డుతుంటారు. తాజాగా అనసూయ డ్రెస్సింగ్‌ స్టైల్‌పై సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు వివాదాస్పద కామెంట్స్‌ చేశారు.

అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్‌ చేశారు. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్‌ నాకు నచ్చదు. ఆమెపై గౌర‌వం ఉంది కాబ‌ట్టే మంచి చెబుతున్నాను. రోజా చాలా ప‌ద్ద‌తిగా క‌నిపిస్తారు.. అని పేర్కొన్నారు కోట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now