Pooja Hegde : చిరంజీవి, య‌ష్‌ల‌పై పూజా హెగ్డే స్ట‌న్నింగ్ కామెంట్స్‌..!

October 18, 2021 11:00 PM

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. కేవలం తెలుగు భాష‌లోనే కాదు ఇత‌ర భాష‌ల‌లోనూ స‌త్తా చాటుతోంది. ఒకలైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ పొడుగుకాళ్ల సుందరి.. ఆతర్వాత వరుస సినిమాలతో తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా బడా హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ చిన్నది హిందీ ప‌రిశ్ర‌మ‌లో కూడా అడుగుపెట్టింది.

Pooja Hegde comments on chiranjeevi and yash

పూజా హెగ్డే న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది. ఇక ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఈ అమ్మడిని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. మరో వైపు పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాలోనూ పూజా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో తరచూ యాక్టిివ్ గా ఉండే పూజా హెగ్డే అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం గురించి అడగగా.. అది పీరియాడిక్ లవ్ స్టోరీ, గొప్పగా, అద్భుత విజువల్స్ తో ఉండనుందని.. చెప్పింది. ఒక్క ముక్క లో తలపతి విజయ్ స్వీటెస్ట్ అని తెలిపింది. కన్నడ సినీ పరిశ్రమ గర్వ పడే స్టార్ య‌ష్ అని తెలిపింది. మీ డ్రీమ్ అంటూ ఒకరు అడగగా.. ఒన్ అండ్ ఓన్లీ అమితాబ్ బచ్చన్ సర్ అని తెలిపింది. ఏదో ఒక రోజు తన కల నెరవేరుతుందని అనుకుంటున్నా.. అని చెప్పింది. కష్టపడి పని చేయడానికి చిరంజీవి స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment