Krishna Kaushik : జైలులో బట్టలు విప్పి నిలుచోవాలని అన్నారు.. చేదు అనుభవాన్ని తెలియజేసిన నటుడు..

October 18, 2021 4:07 PM

Krishna Kaushik : తెలుగులో చాలామంది బుల్లితెర నటులకు మంచి క్రేజ్ ఉంది. నటుడిగా, యాంకర్ గా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న వారిలో శ్రీకృష్ణ కౌశిక్ కూడా ఒకరు. ఆయన తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఇటీవల పంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ లు వీఐపీ జైల్ లో ఉన్నప్పుడు తాను జనరల్ బరాక్ లో ఉన్నానని అన్నారు. అక్కడ దాదాపుగా 80 మంది ఖైదీలున్నారని అన్నారు. ఒక్కొక్కరికి ఒక ప్లేట్, దుప్పటి ఇచ్చారని పక్కనే పెట్టుకుంటే ఎవరో తీసేసుకున్నారని అన్నారు.

Krishna Kaushik told about his experience in jail

ఆ విషయాన్ని అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ కి చెప్తే ఇక్కడ దొంగలుంటారని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పారట. అక్కడ బాత్ రూమ్ కి డోర్స్ ఉండవు. అయినా అలాగే వెళ్ళాలని అన్నారట. అలాగే జైలులో కౌంట్ చేసుకుంటూ వస్తూ తన దగ్గరకు వచ్చేసరికి ఏంటి సార్ అని అన్నారని తెలిపారు. మీరు ఫైట్ చేస్తున్న కారణం మంచిది సర్, మీరు చేసేది మీకు కచ్చితంగా మంచి చేస్తుందని జైలర్ అన్నట్లు తెలిపారు. ఆయన అలా అనడంతో తనకు మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నారు. ఇక అక్కడ రిజిస్టర్ లో పేరు రాసుకున్నాక, మొలతాడుతో పాటు ఇంకేమైనా తాళ్ళు ఉంటే వాటిని కట్ చేశారని అన్నారు.

అలాగే ఖైదీలను నగ్నంగా  నిలుచోవాలనేసరికి షాక్ అయ్యారట. ఎందుకంటే ఎక్కడైనా గాయాలు అయ్యాయేమోనని టార్చ్ లైట్ వేసుకుని మరీ చూస్తారని కౌశిక్ అన్నారు. ఒకవేళ ఏమైనా అయితే కేస్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి అని తెలిపారు. మమ్మల్ని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళాక.. కానిస్టేబుల్.. కౌశిక్ ని చూసి సర్ మీరా బట్టలు వేసుకోండి.. నేను చెబుతాలే.. అని అన్నాడని తెలిపారు. ఆ క్షణంలో కళాకారుడికి ఇంత మర్యాద ఉంటుందా.. అని ఎంతో ఆనందం వేసిందని.. కౌశిక్ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment