Rashmika : దీన్ని సినిమాల్లోకి ఎలా తీసుకున్నారు.. అంటూ ర‌ష్మికపై ఫైర్..

October 17, 2021 2:55 PM

Rashmika : క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ దక్కించుకుంటోంది. దసరా పండుగ సందర్భంగా రష్మిక హీరోయిన్ గా నటించిన తెలుగు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందులో ర‌ష్మిక క్యూట్ లుక్స్‌లో క‌నిపించింది.

Rashmika befitting reply to netizen

అయితే కొంద‌రు మాత్రం ర‌ష్మిక‌పై నెగెటివ్ కామెంట్స్ చేశారు. దీన్ని సినిమాల్లోకి ఎలా తీసుకున్నారురా.. అంటూ రష్మిక ఫోటోను, నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. త‌న‌పై చేసిన ట్రోల్స్‌కి ర‌ష్మిక క్యూట్‌గా స్పందించింది. “నా యాక్టింగ్ కోసం ” అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీనికి ఆ నెటిజన్ మళ్ళీ తిరిగి స్పందించలేదు. రష్మిక స్పోర్టివ్, కాన్ఫిడెంట్ రిప్లై తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

రీసెంట్‌గా దక్షిణాది సినీ తారల సోషల్ మీడియా పాపులారిటీ ఆధారంగా ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితా రూపొందించింది. ఇందులో రష్మిక మందన్న 9.88 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, విజయ్ దేవరకొండ (9.67) రెండోస్థానంలో ఉన్నాడు. కన్నడ స్టార్ యశ్ (9.54) మూడో స్థానంలో, సమంత (9.49) నాలుగో స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ (9.46) కు ఐదో స్థానం, ప్రభాస్ (9.40) కు ఎనిమిదో స్థానం లభించాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment