NTR Samantha : ఆ షోకి హోస్ట్ గా సమంత.. షాక్ అయిన ఎన్టీఆర్!

October 16, 2021 4:11 PM

NTR Samantha : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి మంచి రేటింగ్ వస్తున్నాయని చెప్పవచ్చు. ఇక పోతే ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేసి తమదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సమంత అతిథిగా వచ్చారు. షోలో సమంత ఎంతో చాకచక్యంగా ఆడుతూ 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు.

NTR Samantha mesmerized audience with their evaru meelo koteeshwarulu show

ఈ ఆటలో భాగంగా సమంత, ఎన్టీఆర్ లు ఎంతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా సమంత మాట్లాడుతూ..  ఎవరు మీలో కోటీశ్వరులు తదుపరి సీజన్‌కు మీకు బదులుగా నేను హోస్ట్‌ చేయవచ్చా ? అని సమంత ఎన్‌టీఆర్‌ను అడిగింది. దీంతో ఎన్టీఆర్ షాక్ అయ్యారు.

ఇక ఎన్టీఆర్.. ఇదే విషయాన్ని డిక్లేర్ చేయమంటారా.. అని కంప్యూటర్‌ని అడగడంతో.. అందుకు సమంత స్పందిస్తూ.. మీ ఫ్యాన్స్ కు మాత్రం చెప్పకండి.. అంటూ దండం పెడుతుంది. నా ఫ్యాన్స్ బంగారాలు అంటూ ఎన్టీఆర్ అభిమానులను పొగుడుతారు. ఇలా సమంత ఎంతో సరదాగా ఆడుతూ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పాతిక లక్షలు గెలుచుకొని వాటిని ప్రత్యూష ఫౌండేషన్ కు విరాళం అందించింది. అయితేె ఎవరు మీలో కోటీశ్వరులు షోకు సమంత తదుపరి సీజన్‌కు హోస్ట్‌గా వస్తుందా ? అందుకనే ఈ విధంగా చేశారా ? అన్నది ఇప్పటికైతే సందేహమే. తరువాత ఏం జరుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment