Pooja Hegde : క్యూట్ స్మైల్ ఇస్తూ కెమెరా వైపు చూస్తున్నచిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..!

October 14, 2021 10:39 AM

Pooja Hegde : క‌రోనా వల్ల ప్ర‌క‌టించిన లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా మంది సెల‌బ్రిటీల‌కు సంబంధించిన పాత ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇవి చూసిన అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డె త‌న 31వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చెల్లెలి బ‌ర్త్‌డేలో దిగిన క్యూట్ పిక్ షేర్ చేసింది. కెమెరా వైపు చూస్తూ క్యూట్‌గా క‌నిపిస్తున్న ఈ బుట్ట‌బొమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా సినీ ప‌రిశ్ర‌మ‌ను ఏలుతోంది.

Pooja Hegde in this pic shared on social media

తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లోను న‌టిస్తూ అల‌రిస్తోంది. పూజా తాజాగా నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఇక పూజా ఈ ఏడాది అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్‌’, ‘బీస్ట్‌’ వంటి చిత్రాల్లో నటిస్తుండ‌గా, ఇందులో రెండు సినిమాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి.

‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. టాలీవుడ్‌ యంగ్‌ బడా హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. రానున్న రోజులలో ఈ అమ్మ‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ –  హ‌రీష్ శంక‌ర్ సినిమాలలో న‌టించ‌నుంది. అలాగే మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ సినిమాలోనూ సంద‌డి చేయ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment