Samantha : గతం గ‌తః.. బాలీవుడ్ సినిమాపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న స‌మంత‌..

October 13, 2021 11:00 AM

Samantha : ప‌దేళ్ల ప్రేమాయ‌ణం.. మూడేళ్ల వైవాహిక బంధానికి తెర దించారు నాగ చైత‌న్య‌ – స‌మంత‌. క్రేజీ క‌పుల్‌గా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన ఈ జంట స‌డెన్‌గా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోయారు. చైతూ కంటే ఎక్కువ నెగిటివిటీని సమంతనే ఫేస్ చేస్తోంది. అందుకే విడాకుల ప్రకటన తర్వాత తన భావాలన్నీ పరోక్షంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌‌తో పంచుకుంటోంది సామ్. ఇటీవ‌ల త‌న‌పై వ‌స్తున్న పుకార్ల‌కి సుదీర్ఘ పోస్ట్ ద్వారా సామ్ క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Samantha may announce her next bollywood film

పెళ్లి తర్వాత సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని అనుకున్న స‌మంత పిల్ల‌ల‌ని క‌నాలనే ప్లాన్ చేసింద‌ని ఆమె స‌న్నిహితులు అంటున్నారు. అయితే ఇప్పుడు డైవోర్స్ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి పెడుతుంద‌ట‌. భారీ బడ్జెట్ తో గుణశేఖర్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన శాకుంత‌లం సినిమాని ఇప్ప‌టికే పూర్తి చేసిన సామ్ ఓ త‌మిళ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇది పూర్త‌య్యాక స‌మంత‌.. తాను ఒప్పుకున్న‌మూడు ప్రాజెక్టుల‌కు సంబంధించిన విష‌యాల‌ను వెల్ల‌డించ‌నుంద‌ని స‌మాచారం.

ఫ్యామిలీ మ్యాన్ 2 త‌ర్వాత స‌మంత‌కు బాలీవుడ్ ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని అంటున్నారు. స‌మంత న‌టించిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ జ‌రుపుకుంటోంది. శకుంతలగా సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు.

ఇక చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ కుమార్తే బేబీ అర్హ అలరించబోతోంది. సోమవారం నుండి డబ్బింగ్ ప్రారంభించినట్టు గుణ టీమ్ వర్క్స్ సంస్థ తెలిపింది. పాన్ ఇండియా మూవీగా పలు భారతీయ భాషల్లో ఒకేసారి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment