రూ.8,499కే ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర ఎలా ఉన్నాయంటే..?

April 22, 2021 1:04 PM

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్.. హాట్ 10 ప్లే పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.82 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌ల‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ల‌భిస్తుంది. వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇందులో అందిస్తున్నారు.

Infinix Hot 10 Play smart phone launched in india

ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే ఫీచ‌ర్లు

  • 6.82 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1640 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్
  • 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్
  • 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్
  • ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
  • 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్ ఏగియ‌న్ బ్లూ, మొరాండీ గ్రీన్‌, ఆబ్సిడియ‌న్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.8,499 గా ఉంది. ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment