Tollywood : సెల‌బ్రిటీలు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు ? అందుకు కార‌ణాలు ఏమిటి ?

October 13, 2021 7:36 AM

Tollywood : ఏ రంగంలో ఉన్న సెల‌బ్రిటీలు అయినా స‌రే.. కొన్ని సార్లు దాంప‌త్య జీవితంలో పొర‌ప‌చ్చాలు వ‌స్తే ఏమాత్రం ఆలోచించ‌కుండా వెంట‌నే విడాకులు తీసుకుంటారు. అయితే వారు ధ‌నికులు క‌నుక అనేక కార‌ణాల‌ను చూపిస్తూ వారు విడాకులు తీసుకుంటారు. కానీ సాధార‌ణ ప్ర‌జ‌లు అలా కాదు. ఎన్నో స‌మస్య‌ల‌కు ఓర్చుకుంటారు. జీవితంతో, కుటుంబ స‌భ్యుల‌తో రాజీ ప‌డ‌తారు. క‌నుక సాధార‌ణ ప్ర‌జ‌లు విడాకులు తీసుకునే శాతం త‌క్కువే. సెల‌బ్రిటీలే ఎక్కువ‌గా విడాకులు తీసుకుంటుంటారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి.

Tollywood why celebrities taking divorce what are the reasons

సెల‌బ్రిటీలకు స‌హ‌జంగానే చాలా ధ‌నం ఉంటుంది. భార్య లేదా భ‌ర్త ఎవ‌రైనా స‌రే.. బాగా సంపాదించే వారు లేక త‌ల్లిదండ్రుల నుంచి వ‌చ్చిన ఆస్తిని క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలో వారికి ఆర్థిక స్వ‌తంత్రం ఉంటుంది. ఏవైనా చిన్న గొడ‌వ‌లు వ‌స్తే.. నీ నుంచి విడిపోయి నేను బ‌త‌క‌లేనా ? నా ద‌గ్గ‌ర కూడా డ‌బ్బు ఉంది, నువ్వు లేక‌పోయినా నేను బ‌త‌క‌గ‌ల‌ను.. అని ఆలోచిస్తారు. దీంతో ఏమాత్రం ఆలోచించ‌కుండా వెంట‌నే విడాకులు ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌లు ఇలా కాదు. రాజీ ప‌డిపోతారు. క‌నుక విడాకుల ప్ర‌స‌క్తి చాలా వ‌ర‌కు ఉండ‌దు.

ఇక సెల‌బ్రిటీలు అంటేనే చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటారు. క‌నుక వారు ఎప్పుడైనా ఎవ‌రితో అయినా ప్రేమ‌లో ప‌డొచ్చు. పెళ్ల‌యి పిల్ల‌లు ఉన్న‌ప్ప‌టికీ ఒక వ్య‌క్తి ప‌ట్ల ఆక‌ర్ష‌ణ క‌లుగుతుంది. దీంతో కాపురం చేసే జీవిత భాగ‌స్వామితో విడాకులు తీసుకుంటారు. ఈ కార‌ణం వ‌ల్ల చాలా సెల‌బ్రిటీ జంట‌లు విడిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి.

సెల‌బ్రిటీ జంట‌ల్లో స‌హ‌జంగానే భార్య, భ‌ర్త‌కు పేరు ప్ర‌ఖ్యాతులు ఉంటాయి. ఫ్యాన్స్ ఉంటారు. ఎప్పుడైనా సంసారంలో చిన్న గొడ‌వలు వ‌చ్చినా.. ఒక‌రిని ఒక‌రు నాలుగు మాట‌లు అన్నా.. సాధార‌ణ ప్ర‌జ‌లు అయితే స‌ర్దుకు పోతారు. కానీ సెల‌బ్రిటీలు అయితే ఇగో హ‌ర్ట్ అయిన‌ట్లు భావిస్తారు. రాజీ ప్ర‌స‌క్తే ఉండ‌దు. క‌నుక వెంట‌నే విడాకులు తీసుకుంటారు. ఇది కూడా వారి విడాకుల‌కు ఒక కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు.

సెల‌బ్రిటీ జంట‌లు త‌మ దాంప‌త్య జీవితంలో ఒక‌రిపై ఒక‌రికి బోర్ కొట్ట‌డం స‌హ‌జ‌మే. దీంతో కొంద‌రు కొత్త‌ద‌నం కోసం కూడా విడాకులు తీసుకుని ఇంకో లైఫ్ పార్ట్ న‌ర్‌తో సెటిల్ అవుతారు. ఇది కూడా వారి విడాకుల‌కు ఒక కార‌ణంగా భావించ‌వ‌చ్చు.

అయితే ఈ కార‌ణాల వ‌ల్లే వారు విడాకులు తీసుకోవాల‌ని ఏమీ లేదు. ఇంకా భిన్న‌మైన కార‌ణాల వ‌ల్ల విడాకులు కూడా తీసుకుంటారు. కానీ సెల‌బ్రిటీల్లో విడాకులు తీసుకునే శాతం ఎక్కువ‌..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment