Roshan : నా తమ్ముడిని ఇండస్ట్రీకి లాంచ్ చేసే డైరెక్టర్ అతనే.. శ్రీకాంత్ తనయుడు రోషన్!

October 12, 2021 7:36 PM

Roshan : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది సినీ వారసులు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి తనదైన శైలిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రోషన్‌ మరో మూవీ రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో పెళ్లిసందD సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Roshan  says his brother will enter into tollywood with that director

ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ తను బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించి సూపర్ హిట్టయిన “దబాంగ్ త్రీ” సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారని రోషన్ తెలియజేశారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదని ఈ సందర్భంగా రోషన్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా త్వరలోనే తన తమ్ముడు రోహన్ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడనే ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇప్పటికే రోషన్ కి సంబంధించిన కథ సిద్ధమవుతోందని, తన తమ్ముడు రోహన్ ను ఇండస్ట్రీలోకి డైరెక్టర్ ప్రభుదేవా లాంచ్ చేయబోతున్నారని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేయనున్నట్లు రోషన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపోతే పెళ్లిసందD సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment