Aditi Rao Hydari : వామ్మో.. అదితి రావు హైద‌రి ఒక్కో సినిమాకు అంత డిమాండ్ చేస్తోందా ?

October 12, 2021 12:32 PM

Aditi Rao Hydari : తెలుగులో పెద్ద స‌క్సెస్ చిత్రాలు లేకున్న‌ప్ప‌టికీ న‌టి అదితి రావు హైద‌రికి క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. స‌మ్మోహ‌నం మూవీ ఒక్క‌టే ఆమె ఖాతాలో హిట్ చిత్రంగా నిలిచింది. త‌రువాత ఏ సినిమాలూ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఇక ఈమె తాజాగా న‌టించిన మ‌హా స‌ముద్రం మూవీ ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Aditi Rao Hydari demands huge remuneration for one movie

మ‌హా స‌ముద్రం మూవీలో అదితి.. మ‌హా పాత్ర‌లో న‌టించింది. ఈ సంద‌ర్బంగా ప్రీ రిలీజ్ వేడుక‌ల‌ను కూడా ఇటీవ‌ల గ్రాండ్‌గా నిర్వ‌హించారు. అయితే ఆ స‌మ‌యంలో ఈ బ్యూటీ త‌న మ‌న‌స్సులోని మాట‌ను బ‌య‌ట పెట్టింది. త‌న త‌ల్లి స్వ‌స్థ‌లం వ‌న‌ప‌ర్తి అని, తాను స‌గం తెలుగు అమ్మాయిన‌ని.. క‌నుక తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాల‌నుంద‌ని కూడా తెలియ‌జేసింది.

అయితే బాలీవుడ్‌లో చేసిన‌ట్లు తెలుగు సినిమాల్లో స్కిన్ షో చేయ‌న‌ని ఈ అమ్మ‌డు నిర్మాత‌ల‌కు చెప్పింద‌ట‌. కానీ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం త‌గ్గేదే లేద‌ని అంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈమె క‌న్నా క్రేజ్ ఎక్కువ ఉన్న కొత్త హీరోయిన్ల‌కు ఒక్కో సినిమాకు రూ.50 ల‌క్ష‌ల నుంచి రూ.60 ల‌క్ష‌లు ఇస్తున్నారు. కానీ అదితి మాత్రం ఒక్క సినిమాకు ఏకంగా రూ.1 కోటి వ‌ర‌కు డిమాండ్ చేస్తుంద‌ని తెలిసింది.

అయిన‌ప్ప‌టికీ అదితిని త‌మ సినిమాల్లో న‌టింప‌జేసేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నార‌ట‌. అందుక‌నే ఈమె అంత మొత్తం డిమాండ్ చేస్తుంద‌ని తెలిసింది. మ‌రి ఈమె టాలీవుడ్‌లో స‌క్సెస్ బాట‌లో న‌డుస్తుందా, లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment