Anushka Shetty : అనుష్కకు అప్పుడే పెళ్లి జ‌రుగుతుంద‌ట‌.. జ్యోతిష్యుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

October 11, 2021 7:49 PM

Anushka Shetty : జ్యోతిష్యాన్ని నిజానికి చాలా మందే న‌మ్ముతారు. అయితే వారు చెప్పేది నిజం అయ్యే సంద‌ర్భంలోనే వాళ్ల‌ను న‌మ్ముతారు. ముఖ్యంగా ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎలా లెక్క వేస్తారో తెలియ‌దు కానీ.. అనేక విష‌యాల గురించి ఆయ‌న ముందుగానే చెప్పి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆయ‌న చెప్పిన అనేక విష‌యాలు నిజం అయ్యాయి.

Anushka Shetty marriage may be happen at that time says astrologer

స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటార‌ని ఆయ‌న గ‌తంలో వ్యాఖ్య‌లు చేశారు. అవి అబ‌ద్ద‌మ‌ని చాలా మంది కొట్టి పారేశారు. అంత‌టి బ్యూటిఫుల్ క‌పుల్ ఎందుకు విడిపోతారు.. అంటూ ఆయ‌న‌ను శాపనార్థాలు పెట్టారు. కానీ చివ‌ర‌కు ఆయ‌న చెప్పిందే నిజ‌మైంది. ఇక మ‌రోనటి అనుష్క శెట్టి విష‌యంలో ఓ జ్యోతిష్యుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అనుష్క శెట్టి తన వృత్తిలో చాలా సిన్సియర్‌గా ఉంటుందని అన్నారు. ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని.. సినిమా రంగానికి చెంద‌ని వ్య‌క్తినే ఆమె పెళ్లి చేసుకుంటుంద‌ని చెప్పారు.

క‌చ్చితంగా అనుష్క‌ బయట వ్యక్తినే పెళ్లి చేసుకుంటుంద‌ని.. అలాగే 2023 లోపు ఆమె పెళ్లి జరుగుతుంద‌ని అన్నారు. దీంతో ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న చెప్పిన‌ట్లు అనుష్క వివాహం జ‌రుగుతుందా, లేదా.. అన్న‌ది చూడాలి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment