Samantha : స‌మంత ఆ ఛానల్ పేరు చెబితేనే క‌స్సుమంటుంద‌ట‌..!

October 11, 2021 5:36 PM

Samantha : నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత సమంత నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తోంది. ఆమె చైకి విడాకులు ఇవ్వడానికి ప‌లు కార‌ణాలు చెబుతూ ప్రముఖ ఛానల్ వ‌రుస క‌థ‌నాలు ప్ర‌సారం చేసింది. సామ్-చై ప్రేమ పెళ్లిపై ప్రత్యేక కథనాలు.. అటుపై ఇద్దరి మద్య సాగిన బంధం గురించి.. ఆ తర్వాత వివాదం మొదలైన నాటి నుంచి ఇద్దరి మధ్య పెరిగిన దూరం గురించి ఆసక్తికర కథనాల్ని ప్రసారం చేసింది. ఇలాంటివి త‌న‌ని ఏం చేయ‌లేవ‌ని స‌మంత చెప్పుకొచ్చింది.

Samantha feeling irritated when that channel name spoken

రీసెంట్‌గా స‌ద‌రు ఛానల్ స‌మంత‌తో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ తీసుకోవాల‌ని భావించింద‌ట‌. త‌ద్వారా టీఆర్పీ రేటింగ్ కూడా పెంచుకోవాల‌ని చూసింద‌ట‌. కాని ఆ ఛానల్ పేరెత్తితేనే స‌మంత క‌స్సుబ‌స్సుమంటుంద‌ట‌. వాళ్ల‌కు ఎలాంటి ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌నని డైరెక్ట్‌గా చెప్పేసింద‌ట‌. ఇదిలా ఉంటే స‌మంత విడాకుల త‌ర్వాత ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొంది. ఈ ఎపిసోడ్ ద‌స‌రా కానుక‌గా ప్ర‌సారం కానుంది.

ఎన్టీఆర్‌తో స‌మంత చేసే సంద‌డి ఓ రేంజ్‌లో ఉండ‌నుంద‌ని ప్రోమో చూస్తుంటేనే అర్ద‌మ‌వుతుంది. ఇక సమంత విడాకుల తర్వాత సామ్ మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. సమంతకు ఫ్యామిలీ లైఫ్ అంటే ఎంతో ఇష్టమని.. పిల్లల్ని కని జీవితంలో స్థిరపడాలని ఎంతో ఆశ పడిందని తెలిపింది. అందుకోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఎన్నో పెద్ద అవకాశాలు వచ్చినా కాదనుకుంది.. అని ప‌లు విష‌యాలు వెల్ల‌డించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment