Kajal Aggarwal : వార్నీ.. స‌ర్‌ప్రైజ్ అంటే ఇదేనా కాజ‌ల్ ? ఇంకేదో అని ఊహించుకున్నారు..!

October 11, 2021 12:43 PM

Kajal Aggarwal : గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న త‌రువాత కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమాల్లో న‌టించ‌డం మానేస్తుంద‌ని అనుకున్నారు. కానీ వివాహం అయ్యాకే ఈమె స్పీడు పెంచింది. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య‌లో న‌టిస్తూనే ప‌లు ఆఫ‌ర్ల‌ను కొట్టేసిందని టాక్ న‌డుస్తోంది.

Kajal Aggarwal told about her surprise what is that

అయితే కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీని పోస్ట్ చేసింది. అతి త్వ‌ర‌లో ఓ స‌ర్‌ప్రైజ్‌ను ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పింది. దీంతో అంద‌రూ ఈ అమ్మ‌డు ప్రెగ్నెంట్ అయింద‌ని, అదే విష‌యాన్ని చెబుతుంద‌ని అనుకున్నారు. ఇక ఆమె ఒప్పుకున్న సినిమాల‌ను కూడా మానేస్తుంద‌ని, ప్రెగ్నెంట్ అయ్యింది క‌నుక‌.. సినిమాల‌కు కూడా గుడ్ బై చెబుతుంద‌ని భావించారు. ఇది రెండో స‌ర్‌ప్రైజ్ కావ‌చ్చ‌ని భావించారు. కానీ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆ స‌ర్‌ప్రైజ్ ఏంటో చెప్పేసింది. దీంతో నెటిజ‌న్లు ఉసూరుమంటున్నారు.

https://www.instagram.com/p/CU1-il8Melp/?utm_source=ig_web_copy_link

కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు కుక్క‌లు అంటే మ‌హా ఇష్టం. అందులో భాగంగానే ఓ కొత్త శున‌కాన్ని ఇంటికి తెచ్చుకుంది. దానికి మియా అని పేరు పెట్టారు. దాని గురించి చెబుతూ.. మా ఫ్యామిలీలో కొత్త మెంబ‌ర్ వ‌చ్చి చేరింద‌ని చెప్పింది. అయితే ఇది స‌ర్‌ప్రైజ్ ఏంటి ? అని ఫ్యాన్స్ పెద‌వి విరుస్తున్నారు. మ‌రి ఆమె చెప్పాల‌నుకున్న స‌ర్‌ప్రైజ్ ఇదేనా ? ఇంకా ఏదైనా ఉందా ? అన్న‌ది.. వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment