Instagram : అబ్బా.. ఇన్‌స్టాగ్రామ్ మ‌ళ్లీ డౌన్ అయింది.. ఇది రెండో సారి..

October 9, 2021 12:13 PM

Instagram : ప్ర‌ముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సంస్థ ఫేస్‌బుక్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌తోపాటు ఫేస్‌బుక్ కూడా ఇటీవ‌ల 6 గంట‌ల పాటు ప‌నిచేయ‌కుండా పోయిన సంగతి తెలిసిందే. రాత్రి 9 గంట‌ల‌కు ఈ మూడు నెట్‌వ‌ర్క్‌ల సేవ‌లు నిలిచిపోగా.. వాటిని పున‌రుద్ధ‌రించేందుకు ఏకంగా 6 గంట‌ల‌కు పైగానే స‌మ‌యం ప‌ట్టింది. అయితే దీని వెనుక సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ఫేస్‌బుక్ కార‌ణాలుగా చూపింది. కానీ విష‌యం వేరే ఉంద‌ని తెలుస్తోంది.

Instagram services down again this is second time

అయితే ఇన్‌స్టాగ్రామ్ సేవ‌లు ఈ వారంలో రెండో సారి నిలిచిపోయాయి. అర్థ‌రాత్రి 12 గంట‌ల త‌రువాత దాదాపుగా గంట సేపు ఇన్‌స్టాగ్రామ్ ప‌నిచేయ‌లేదు. దీంతో యూజ‌ర్లు చాలా ఇబ్బందులు ప‌డ్డారు. వారి ఫీడ్‌లో ఏమీ క‌నిపించ‌లేదు.

ఇక ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యాక కొంత సేపు ఇన్‌స్టాగ్రామ్ గౌన్ అగెయిన్ అనే హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అయింది. త‌రువాత ట్విట్ట‌ర్ లో యూజ‌ర్లు కొంత సేపు మీమ్స్ పోస్ట్ చేశారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ సేవ‌లు మ‌ళ్లీ అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే దీనిపై ఆ సంస్థ స్పందించింది. సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌డంపై చింతిస్తున్నామ‌ని, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌ని క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment