అదిరిపోయే డిస్‌ప్లే, బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌తో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ఫోన్లు..!

April 21, 2021 1:53 PM

స్మార్ట్ ఫోన్ త‌యారీదారు మోటోరోలా కొత్త‌గా మోటోజి60, మోటోజి40 ఫ్యుష‌న్ పేరిట రెండు ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిల్లో 6.8 ఇంచుల మాక్స్ విజ‌న్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఇక ఈ ఫోన్ల‌లో స్నాప్‌డ్రాగ‌న్ 732జి ప్రాసెస‌ర్ను, 6జీబీ వ‌ర‌కు ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ వీటిలో ల‌భిస్తుంది. వీటిల్లో 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి 20 వాట్ల ట‌ర్బో ప‌వ‌ర్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది.

Moto G40 Fusion and Moto G6 launched in India

జి60 ఫోన్‌లో వెనుక వైపు 108 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాతోపాటు ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. జి40 ఫ్యుష‌న్ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ రెండింటికీ వెనుక భాగంలో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు.

మోటో జి60, మోటో జి40 ఫ్యుష‌న్ ఫీచ‌ర్లు

  • 6.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 × 2460 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 732జి ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్
  • 64/128 జీబీ స్టోరేజ్‌, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌
  • జి60 – 108, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • జి40 ఫ్యుష‌న్ – 64, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రీపెల్లెంట్ కోటింగ్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
  • డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
  • 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 20 వాట్ల ట‌ర్బో ప‌వ‌ర్ ఫాస్ట్ చార్జింగ్

మోటో జి60, మోటో జి40 ఫ్యుష‌న్ స్మార్ట్ ఫోన్లు డైన‌మిక్ గ్రే, ఫ్రాస్టెడ్ షాంపేన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల‌య్యాయి. మోటో జి60కి చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.17,999గా ఉంది. దీన్ని ఏప్రిల్ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తారు.

మోటో జి40 ఫ్యుష‌న్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.13,999గా ఉంది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.15,999గా ఉంది. మే 1వ తేదీ నుంచి ఈ ఫోన్‌ల‌ను విక్ర‌యిస్తారు. ఫ్లిప్‌కార్ట్‌లో ల‌భిస్తాయి.

లాంచింగ్ సంద‌ర్భంగా జి40 ఫ్యుష‌న్ ఫోన్ పై రూ.1000, జి60 ఫోన్‌పై రూ.1500 వ‌ర‌కు ఐసీఐసీఐ కార్డుల ద్వారా ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందివ్వ‌నున్నారు. దీంతో త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఈ ఫోన్లు ల‌భిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment