Samantha : త‌ల్లి కావాల‌నుకుంటున్న‌ట్టు స‌మంత చెప్పింది.. స‌డెన్‌గా ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకుందో..?

October 9, 2021 11:57 AM

Samantha : స‌మంత‌ – నాగ చైత‌న్య విడాకుల వ్య‌వ‌హారాన్ని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఎంతో ఆప్యాయంగా ఉండే వీరు స‌డెన్‌గా డైవోర్స్ తీసుకోవ‌డంపై అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య, సమంతల మధ్య ఏం జరిగి ఉంటుంది ? ఎందుకు విడాకులు తీసుకుని ఉంటారు ? అనే వాటిపై జోరుగా చ‌ర్చ‌లు కూడా చేస్తున్నారు. అయితే ప‌లువురు ప్ర‌ముఖులు డైవోర్స్‌కి ముందు వారు ఎలా ఉండేవాళ్లు, వారి ప్లాన్స్ ఏంట‌నే విష‌యాల‌ని బ‌హిర్గ‌తం చేస్తూ వ‌స్తున్నారు.

Samantha wants to become mother comments by producer

‘శాకుంతలం’ నిర్మాత నీలిమ గుణ తాజాగా ఆమె ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. చై-సామ్‌ విడాకులపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. శాకుంతం సినిమా కోసం మా నాన్న స‌మంత‌ని సంప్ర‌దించిన‌ప్పుడు ఆమె సినిమాలు చేయట్లేద‌ని చెప్పింది. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నామ‌ని చెప్పిన స‌మంత‌కు శాకుంత‌లం క‌థ న‌చ్చ‌డంతో ఓకే చెప్పింది. కొన్ని కండీష‌న్స్‌తో శాకుంత‌లం చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన స‌మంత జూలై, ఆగస్ట్‌ కల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్‌ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్‌ చేసుకున్నాం.

పిల్ల‌లని క‌నాల‌ని అనుకున్న ఈ జంట స‌డెన్‌గా ఎందుకు విడాకులు తీసుకుంటున్నార‌నేది అర్ధం కాని ప్ర‌శ్న‌గా మారిందని చెప్పింది నీలిమ‌. కాగా, కొద్ది రోజులుగా స‌మంత‌పై దారుణంగా ట్రోలింగ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో పోస్ట్ ద్వారా సామ్ స్పందించిన విష‌యం తెలిసిందే. విడాకులు అనేది ఎంతో బాధగా ఉంటుంది. ఇలా నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు.. కానీ ఇవేవీ కూడా నన్ను ముక్కలు చేయలేవు. వెనక్కి నెట్టలేవు.. అని సమంత ఎమోషనల్ అయింది. ప్ర‌స్తుతం సామ్ ఓ త‌మిళ సినిమాతో బిజీగా ఉండ‌గా, రానున్న రోజుల‌లో మూడు సినిమాలు అనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment