Samantha : ప్రెస్‌మీట్‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మంత ? అక్కినేని ఫ్యామిలీ గురించి చెబుతుందా ?

October 9, 2021 10:01 AM

Samantha : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన త‌రువాత స‌మంత‌నే అంద‌రూ టార్గెట్ చేసిన విష‌యం విదిత‌మే. నాగ‌చైత‌న్య సౌమ్యుడ‌ని.. అంతా స‌మంతే చేసింద‌ని.. ఆమె చేసిన ప‌నుల వ‌ల్లే చైతూ ఆమెకు విడాకులు ఇచ్చాడ‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. అయితే స‌మంత తాజాగా ఇలాంటి విమ‌ర్శ‌ల‌పై పోస్ట్ కూడా పెట్టింది.

Samantha may hold press meet and may tell about akkineni family

త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, దుష్ప్ర‌చారాన్ని ఆపాల‌ని స‌మంత ఒక సోష‌ల్ పోస్ట్ ద్వారా కోరింది. అయితే స‌మంత‌కు కూడా చాలా మంది మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయినప్ప‌టికీ అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్ ముందు స‌మంత ఫ్యాన్స్ త‌క్కువే. దీంతో ఆమెపై వ‌స్తున్న విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు.

అయితే త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌, విమ‌ర్శ‌లు, దుష్ప్ర‌చారానికి చెక్ పెట్టేలా స‌మంత ప్రెస్ మీట్‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విధంగా విమ‌ర్శ‌లు ఇలాగే కొన‌సాగితే త‌న భ‌విష్య‌త్తుకు ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి క‌నుక‌.. అస‌లు విష‌యం ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌నే ఉద్దేశంతో స‌మంత ప్రెస్ మీట్ పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే స‌మంత ఒక వేళ నిజంగానే ప్రెస్ మీట్ పెడితే ఏ విష‌యాలు చెబుతుంది ? ఆమెను జ‌ర్న‌లిస్టులు ఏం ప్ర‌శ్నిస్తారు ? అందుకు ఆమె బ‌దులివ్వ‌గ‌ల‌దా ? ఇచ్చినా మ‌ళ్లీ ఏమైనా స‌స్పెన్స్ లో పెడుతుందా ? లేక స‌మంత‌ను అభిమానించే వారు చెబుతున్న‌ట్లు.. అక్కినేని ఫ్యామిలీయే ఆమెను టార్చ‌ర్ చేసి ఉంటే.. వాటిని స‌మంత ప్రెస్ మీట్‌లో బ‌య‌ట పెడుతుందా ? ఆమె అంత‌టి సాహ‌సం చేస్తుందా ? అనే.. ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అయితే స‌మంత నిజంగానే ప్రెస్ మీట్ పెడితే ఆమె సాహ‌సం చేస్తుంద‌నే చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now