Samantha : సమంత అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.. పండగ చేసుకునే విషయం..!

October 8, 2021 7:12 PM

Samantha : గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత, నాగ చైతన్య పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. విడాకులకు ముందు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. విడాకుల తర్వాత విడాకులకు కారణం ఇదే.. అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా విడాకుల అధికారిక ప్రకటన తర్వాత సమంత, నాగ చైతన్య పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి.

Samantha stayed at number one place in social platforms

ఇదిలా ఉండగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో సమంత ఒకరు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే సోషల్ మీడియా ప్లాట్మ్‌ ఫామ్‌ లో కొద్ది రోజుల వరకు మొదటి స్థానంలో ఉన్న కాజల్ అగర్వాల్ ను వెనక్కి నెట్టి సమంత నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.

తాజాగా ఆర్మాక్స్ మీడియా జరిపిన సర్వేలో భాగంగా సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ లిస్టులో సమంత నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాలలో కాజల్, అనుష్క, రష్మిక ఉన్నారు. ఏది ఏమైనా విడాకుల తర్వాత సమంత నంబర్ వన్ స్థానంలో కొనసాగడం గమనార్హం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment