Samantha : అబార్ష‌న్ చేయించుకుందంటూ రూమ‌ర్స్.. గ‌ట్టిగా ఆన్స‌ర్ ఇచ్చిన స‌మంత‌..

October 8, 2021 4:49 PM

Samantha : స‌మంత‌ – నాగ చైత‌న్య అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకోగా, వారిద్ద‌రి వ్య‌వ‌హారానికి సంబంధించి సోష‌ల్ మీడియాలో పెద్ద ర‌చ్చ న‌డుస్తూనే ఉంది. సమంతదే తప్పు అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌ను కూడా దారుణంగా ట్రోల్ చేస్తూ అతడిని నిందిస్తున్నారు. అక్కినేని కోడ‌లిగా ఆమె స‌రైన ప‌ర్స‌న్ కాదంటూ కూడా ట్రోల్ చేశారు. ఈ క్ర‌మంలో ఉద‌యం త‌న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది స‌మంత‌.

Samantha strong reply to those who said her that she got abortion

మహిళలు ఏం చేసినా ప్రశ్నించే ఈ సమాజం.. పురుషులు ఏం చేసినా ఎందుకని ప్రశ్నించదు. ప్రాథమికంగా పాటించాల్సిన నైతిక విలువలు కూడా లేని ఈ సమాజాన్ని మనమే నిర్మించుకున్నాం’ అంటూ ప్రముఖ రచయిత్రి ఫరిదా చెప్పిన ఈ సందేశాన్ని త‌న స్టోరీలో పెట్టుకుంది. ఈ పోస్ట్ చూసి స‌మంత త‌న బాధ‌ను ఇలా వ్య‌క్త‌ప‌రిచింద‌ని చెప్పుకొచ్చారు.

ఇక తన‌పై సోషల్‌ మీడియాలో ఎన్నో అసత్య ప్రచారాలు జరిగాయి. ఎంతోమంది సమంత గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఈ క్ర‌మంలో త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన స‌మంత‌.. మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. న‌న్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ రూమర్స్‌ వ్యాప్తి చేస్తున్నారు. ఎఫైర్స్‌ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్‌ చేయించుకున్నానని, అవ‌కాశ‌వాదిని అంటూ రూమ‌ర్స్ స్ప్రెడ్ చేశారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతోకూడుకున్నది’’ అని సమంత ట్వీట్‌ చేసింది.

చై నుంచి విడిపోయిన తర్వాత సమంత మొదటిసారి ఓ టెలివిజన్‌ షోలో పాల్గొన్నారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా రూపొందిన‌ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా సామ్‌-ఎన్టీఆర్‌ ఎన్నో విషయాలపై సరదాగా ముచ్చటించుకున్నారు. తాజాగా ఆమె షోలో ఇచ్చిన చెక్‌తో దిగిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

https://twitter.com/Samanthaprabhu2/status/1446418402805837825?s=20

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment