Poonam Kaur : పీకే లవ్ అంటూ పూనమ్ కౌర్ పోస్ట్.. ఎవ‌రిని ఉద్దేశించి అంటారు..!

October 8, 2021 10:09 PM

Poonam Kaur : తెలుగు ఇండస్ట్రీలో కాంట్రవర్సీలతో ఉండే హీరోయిన్స్ లో పూనమ్ కౌర్ ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. పూనమ్ కౌర్ సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ విశేషాల్ని షేర్ చేసుకుంటుంది. అలాగే టాలీవుడ్ లో ఏమైనా వివాదాలు చోటు చేసుకుంటే వాటిపై స్పందిస్తూ అభిమానులకు తన ధోరణి వినిపిస్తుంది.

Poonam Kaur tweet trending in social media

ఇక ఈ క్యూట్ బ్యూటీ చేసిన లేటెస్ట్ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పూనమ్ కౌర్ తన సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసిందంటే.. పీకే లవ్.. అంటూ హ్యాష్ ట్యాగ్ తో కొన్ని ఫోటోస్ ని షేర్ చేసింది. పూనమ్ కౌర్ పేరు అనవసరమైన వివాదంతో ఆమె పేరు సోషల్ మీడియాలో వచ్చినందుకు ఎలా ఫీలవుతుందో అని భావించారు. అయితే ఈ విషయంపై పూనమ్ స్పందించకపోవడం విశేషం. పూనమ్ పెట్టే పోస్టులు ఎవరిని ఉద్దేశించి పెడుతుందో కూడా సస్పెన్స్ గానే ఉంచుతుంది.

ప్రకాష్ రాజ్ ను మా ఎన్నికల్లో గెలిపిస్తే తాను ఎంతోకాలంగా సైలెంట్ గా ఉన్న ప్రాబ్లెమ్స్ ఆయనతో చర్చిస్తానని కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసింది. ఇప్పుడు పీకే లవ్ అంటూ పెట్టిన పోస్టులతో మరోసారి ట్రెండ్ అవుతోంది. ఇక పీకే అంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ ఏర్పడింది. ఆయన్ను పీకే అని పిలుచుకునేవారే ఎక్కువ. అనుకోకుండా పూనమ్ కౌర్ నేమ్ కూడా షార్ట్ కర్ట్ లో పీకే నే అవ్వడం గమనార్హం. అందుకే పూనమ్ పెట్టిన ట్వీట్ కి పవన్ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది పీకే అంటే పవన్ కళ్యాణే ఎందుకు అవ్వాలి.. పూనమ్ కౌర్ గానీ, పోసాని కృష్ణ మురళి కూడా అవ్వచ్చు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now