Samantha : త‌న‌ని దూషించే వారికి గ‌ట్టిగా స‌మాధానం చెప్పిన స‌మంత‌..!

October 8, 2021 1:15 PM

Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్, రేంజే వేరు. ఈమెకు సోషల్ మీడియాలో కూడా అంతే క్రేజ్ ఉంది. ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ కంటెంట్ తో పాటు పలు రకాల పోస్టులను కూడా తన ఇన్ స్టా, ట్విట్టర్ అకౌంట్స్ లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక సమంత విడాకుల తర్వాత ఆమె సోషల్ మీడియాలో నంబర్ వన్ స్టార్ గా నిలిచింది. దీనికి కారణం సామ్ చేసిన పోస్టులు కూడా ఒక కారణంగా నిలిచాయి. విడాకుల తర్వాత నెటిజన్లు సామ్ అకౌంట్స్ పై ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ చేశారు. లేటెస్ట్ గా చేసిన మరో పోస్ట్ వైరల్ గా మారింది.

Samantha put message in social account to those who trolled her

ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ లో ఎప్పడూ మహిళల్నే ప్రశ్నించే ఈ సొసైటీ ఎందుకు మగవాళ్ళని ప్రశ్నించదంటూ.. అంటే మనకు ప్రాథమిక నైతికత లేనట్టేనా అంటూ ఓ కొటేషన్ ను షేర్ చేసింది. నిజానికి సామ్, చైతన్యల విడాకుల్లో తప్పంతా సమంతదే అంటూ పలు రకాల పోస్టులతోపాటుగా తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోల్ని కూడా విపరీతంగా షేర్ చేస్తూ ట్రోల్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ తోపాటు సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసే హై గ్లామరస్ ఫోటో షూట్స్ వారి విడాకులకు కారణం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ని కూడా రోస్ట్ చేశారు.

Samantha put message in social account to those who trolled her

చైతన్యతో డైవర్స్ అయిన కారణంగా ఒత్తిడిలో ఉన్న సమంతకు ఇలాంటి పోస్టులు ఏంటని ఆమె స్నేహితులు మండిపడుతున్నారు. రీసెంట్ గా జరిగిన ఓ యాడ్ షూట్ లో కూడా సమంత బావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో విడాకులతో మానసికంగా సమంత తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. అయితే వివాహం, విడాకులు అనేవి పూర్తిగా వారి వ్యక్తిగత విషయాలని, ఇందులో ఒక్కర్నే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదంటూ.. సమంతను కొందరు సపోర్ట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment