సినిమాల్లో న‌టీన‌టులు నిజంగానే స్మోకింగ్ చేస్తారా ? ఏదైనా ట్రిక్ ఉంటుందా ?

October 6, 2021 8:40 PM

సినిమాల్లో స‌హజంగానే న‌టీన‌టులు సీన్ల డిమాండ్‌ను బ‌ట్టి అనేక ర‌కాల ప‌నులు చేస్తుంటారు. చాలా మంది న‌టులు స్మోకింగ్ కూడా చేస్తుంటారు. ఏ ద‌ర్శ‌కుడు అయినా స‌రే కావాల‌ని న‌టుల‌తో స్మోకింగ్ చేయించ‌రు. కానీ సీన్ డిమాండ్‌ను బ‌ట్టి త‌ప్ప‌నిస‌రిగా స్మోకింగ్ చేయాల్సి వ‌స్తుంది. అయితే స్మోకింగ్ అల‌వాటు ఉంటే ఓకే. ఆ అల‌వాటు లేని వారు సీన్ల‌లో స్మోకింగ్ ఎలా చేస్తారు ? అంటే..

is it true that actors in movies really smoke

మార్కెట్‌లో ప్రొప్ సిగ‌రెట్లు అని డ‌మ్మీ సిగ‌రెట్లు అందుబాటులో ఉన్నాయి. అవి చూసేందుకు అచ్చం సిగ‌రెట్ల‌లాగే ఉంటాయి. కానీ సిగ‌రెట్లు కావు. సినిమాల్లో నకిలీ గ‌న్‌ల‌ను, బుల్లెట్ల‌ను వాడుతారు క‌దా. అలాగే న‌కిలీ సిగ‌రెట్లు అన్న‌మాట‌.

ఇక ప్రొప్ సిగ‌రెట్ల‌లో తేయాకులు, ల‌వంగాలు, గులాబీ పువ్వుల రెక్క‌లు ఉంటాయి. దీంతో వాటిని మండించిన‌ప్పుడు సిగ‌రెట్ పొగ‌లాగే పొగ వ‌స్తుంది. అంతేకానీ వాటిల్లో పొగాకు ఉండ‌దు. ఈ విధంగా సినిమాల్లో న‌టీన‌టులు స్మోకింగ్ చేస్తారు. అయితే స్మోకింగ్ చేయ‌డం ఆరోగ్యానికి హానిక‌రం. కనుక సినిమాల్లోనే కాదు, ఎవ‌రూ దీన్ని ప్రోత్స‌హించ‌రు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment