Samantha Tattoo : సీక్రెట్ ప్లేస్‌లో చై టాటూ వేయించుకున్న స‌మంత‌.. ఉంచుతుందా, చెరిపేస్తుందా ?

October 6, 2021 10:39 AM

Samantha Tattoo : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని వారసుడు నాగచైతన్య భార్య భర్తలుగా నాలుగేళ్ళ పాటు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించారు. కారణాలైతే తెలియదు గానీ పచ్చగా ఉండే ఈ జంట విడిపోయింది. తమ కుటుంబ సభ్యులతోపాటు అభిమానులకు కూడా నిరాశను పంచారు. ఇక సమంత పెళ్ళి తర్వాత ఓ పచ్చబొట్టు వేయించుకుంది. ఈ పచ్చబొట్టు తమ ప్రేమకు చిహ్నం అని కూడా చాలా సందర్భాల్లో చెప్పింది.

Samantha Tattoo will she remove it or not

అలాగే ఈ పచ్చబొట్టు గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ టాటు వెనుక ఉన్న కథను కూడా తన అభిమానులతో షేర్ చేసుకుంది. కానీ సామ్ కు ఈ ఒక్క పచ్చబొట్టు మాత్రమే కాకుండా తన సీక్రెట్ ప్లేస్ లో మరొక టాటూను వేయించుకుంది. ఈ టాటు మీనింగ్ కు అర్థాన్ని కూడా తన అభిమానులతో పంచుకుంది. ఓ బేబి సినిమా సక్సెస్ మీట్ లో తన సీక్రెట్ పచ్చబొట్టును బయటపెట్టేసింది. నడుముకు పై భాగంలో ఈ టాటూ వేయించుకుంది. ఆ ఈవెంట్ లో ఇంతకాలం తను దాచుకున్న పచ్చబొట్టు చూపిస్తున్నానంటూ తన భర్త చైతునే తనే ప్రపంచం అంటూ ఈ స్టిల్ ని చూపించేసింది.

Samantha Tattoo : ఈ టాటూను సామ్ ఉంచిందా.. చెరిపేసిందా..?

ఈ టాటు మీనింగ్ చై అనే పదాన్ని పర్మనెంట్ గా రాయించుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కలలన్నీ చెదిరినట్టు పరిస్థితి మారింది. వారి ప్రేమ మాసిపోయింది. లేటెస్ట్ గా అభిమానుల డౌట్ ఏంటంటే.. ఈ టాటూను సామ్ ఉంచిందా చెరిపేసిందా అని నెట్టింట్లో గుసగుసలాడుకుంటున్నారు. టెంపరరీగా వేసిన టాటూ అయితే కొన్నాళ్లకు పోతుంది. కానీ ఇది పర్మనెంట్ కాబట్టి చెరిపేయాలంటే చాలా కష్టపడాలి. ఆల్ మోస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడంతో సమానం. అయితే టెక్నాలజీ చాలా మారింది. ఎలాంటి పర్మనెంట్ టాటూస్ ని అయినా చెరిపేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి సామ్ కి ఆ ఆప్షన్ కూడా ఉంది. మరి ఈమె తన చై టాటూని చెరిపేస్తుందా.. లేదా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment