Samantha : స‌మంత‌కి, ఆమె స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్‌కు ఏమిటి సంబంధం ?

October 4, 2021 8:09 AM

Samantha : నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డంతో.. వారి విడాకుల‌కు అభిమానులు అనేక ర‌కాల కార‌ణాల‌ను చెబుతున్నారు. అయితే అనూహ్యంగా స‌మంత స్టైలిస్ట్.. ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్ పేరు తెర మీద‌కు వ‌చ్చింది. గ‌తంలో అత‌ను స‌మంత‌తో చాలా క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ అభిమానులు అత‌న్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇంత‌కీ అత‌నికి, స‌మంత‌కు సంబంధం ఏమిటి ? అని అభిమానులు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Samantha : స‌మంత‌కి, ఆమె స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్‌కు ఏమిటి సంబంధం ?

ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్ ఒక ఫ్యాషన్ డిజైన‌ర్. చిన్న‌ప్ప‌టి నుంచి ఫ్యాష‌న్ డిజైన‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌ని అత‌ను ఆ రంగంలో పేరుగాంచాడు. అత‌ను దుస్తుల‌ను డిజైన్ చేయ‌డంలో గుర్తింపు పొందాడు. ఈ క్ర‌మంలోనే స‌మంత‌కు చేనేత దుస్తులు అంటే ఎంతో ఇష్టం. ఇక ఓసారి తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన చేనేత కార్య‌క్ర‌మంలో స‌మంత పాల్గొన‌గా ఆ కార్య‌క్ర‌మానికి ప్రీత‌మ్ కూడా హాజ‌ర‌య్యాడు. దీంతో ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

అయితే అలా ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో ప్రీత‌మ్ స‌మంత‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అవ‌డం ప్రారంభించాడు. ఓ ద‌శ‌లో అత‌డిపై స‌మంత కాళ్లు పెట్టుకుని ప‌డుకుంది. ఆ ఫొటోను కూడా షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో అప్ప‌ట్లో వైర‌ల్ కాగా సమంత‌ను అంద‌రూ తిట్టిపోశారు. అయితే ఇప్పుడు స‌మంత‌కు విడాకులు కావ‌డంతో మ‌ళ్లీ ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ఇందుకు కార‌ణం ప్రీత‌మ్ యేన‌ని ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. అత‌నిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అయితే స‌మంత‌కు, ప్రీత‌మ్‌కు మ‌ధ్య ఉన్న‌ది ఫ్రెండ్ షిప్ లాంటి సంబంధ‌మేన‌ని, దాన్ని అంత‌లా ద‌గ్గ‌ర‌గా చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని, అత‌ను ఆమె స్టైలిస్ట్ క‌నుక అలా మూవ్ అయ్యాడే కానీ.. వారిద్ద‌రికీ సంబంధం ఎలా అంట‌గ‌డ‌తార‌ని.. కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. స‌మంత విడాకుల అనంత‌రం ప్రీత‌మ్‌ను మాత్రం ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తూ విమ‌ర్శిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now