Bigg Boss 5 : బిగ్‌బాస్ హౌజ్ స‌భ్యుల ట్రీట్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న నాగార్జున‌..

October 4, 2021 6:56 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ 5 సీజ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. నిత్యం ఇంటి స‌భ్యులు హౌస్‌లో సంద‌డి చేస్తున్నారు. ఇక శ‌ని, ఆది వారాలు వ‌స్తే వినోదానికి అవ‌ధులు లేకుండా పోతున్నాయి. తాజాగా ఆదివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ఆద్యంతం ఫ‌న్నీగా సాగింది.

Bigg Boss 5 : బిగ్‌బాస్ హౌజ్ స‌భ్యుల ట్రీట్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న నాగార్జున‌..

ఆదివారం ఎపిసోడ్‌లో హౌస్‌లో నాగార్జున‌కు ఇంటి స‌భ్యులు ట్రీట్ ఇచ్చారు. ఆయ‌న న‌టించిన నిన్నే పెళ్లాడ‌తా మూవీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఇంటి స‌భ్యులు ఆ మూవీలోని పాట‌ల‌కు డ్యాన్సులు చేస్తూ అల‌రించారు. ఇందుకు నాగార్జున స‌ర్ ప్రైజ్ అయ్యారు. ఒక ద‌శ‌లో త‌న క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయ‌ని ఆయ‌నే చెప్పారు.

ఇక ఇంటి స‌భ్యుల‌కు నాగార్జున గెస్సింగ్ గేమ్ పెట్టారు. అందులో సినిమా పేర్ల‌ను గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే శ్రీ‌రామ్ టీమ్ ఇందులో స‌క్సెస్ అయింది. ఇక దాక్కో దాక్కో మేక అనే ఇంకో గేమ్ కూడా నిర్వ‌హించారు. ఇందులోనూ అంద‌రూ న‌వ్వుల‌ను పూయించారు.

ఇక ఎలిమినేషన్‌ ప్రక్రియలో శనివారం ఎపిసోడ్‌లో ప్రియ‌, కాజల్‌, రవి, సన్నీ సేవ్‌ అయ్యారు. ఆదివారం ఎపిసోడ్‌లో సిరి, అనీ మాస్టర్‌, లోబో, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. వీరిలో మొట అనీ మాస్టర్‌, ఆ తర్వాత సిరి సేవ్‌ అయ్యారు. చివరగా లోబో, నటరాజ్‌ మధ్య ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. దీంట్లో చివ‌ర‌కు లోబో సేవ్‌ అయ్యారు. నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఆయన వెళ్లిపోవడంతో ఇంటి సభ్యులు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విధంగా ఆదివారం ఎపిసోడ్ సాగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment