టీకా అంటే భ‌య‌ప‌డి అరిచిన మ‌హిళ‌.. వైర‌ల్ వీడియో..!

July 12, 2021 4:44 PM

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్ర‌మం వేగంగా కొన‌సాగుతోంది. 18 ఏళ్లు పైబ‌డిన వారికి కూడా టీకాల‌ను వేస్తున్నారు. అయితే టీకాల‌ను తీసుకునేందుకు కొంద‌రు మాత్రం భ‌య‌ప‌డుతున్నారు. పెద్ద‌లు కూడా టీకాలు అంటే భ‌య‌ప‌డుతున్నారు. ఓ మ‌హిళ కూడా ఇలాగే టీకా అంటే తెగ భ‌య‌ప‌డింది. టీకా వేయించుకునేట‌ప్పుడు చిన్న పిల్ల‌ల మాదిరిగా అరిచింది. ఈ క్ర‌మంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారింది.

woman screamed of covid vaccine

అయితే ఇది ఆమె త‌ప్పు కాదు. ఆమే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా టీకాలు, ఇంజెక్ష‌న్లు, మందులు అంటే చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు. అలాంటి భ‌యాన్ని Trypanophobia అంటారు. ఇక ఆమె అలా అర‌వ‌డంతో ఆ వీడియోను చూసిన చాలా మంది నెటిజ‌న్లు ఫ‌న్నీగా స్పందిస్తున్నారు.

https://www.instagram.com/reel/CRIvHdtj29A/?utm_source=ig_embed&ig_rid=ded59550-4f58-4ed5-b4c0-3d13ee168f26&ig_mid=383A76B0-C5E6-4826-89B0-DEE60853E80C

అయితే ఇది కొత్తేమీ కాదు. ఇటీవ‌లే ఇలాంటిదే ఇంకో సంఘ‌ట‌న జ‌రిగింది. ఓ మ‌హిళ‌ను త‌మ కుటుంబ స‌భ్యులు ప‌ట్టుకుని వ్యాక్సిన్ సెంట‌ర్‌కు తీసుకువ‌చ్చి మ‌రీ టీకాను వేయించారు. అది కూడా అప్ప‌ట్లో వైర‌ల్ అయింది.

https://twitter.com/rupin1992/status/1409923305755217925

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now