వైరల్: టీవీలో ఒలంపిక్స్ ను చూస్తూ.. వింత చేష్టలు చేస్తున్న పిల్లి!

August 2, 2021 6:05 PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి టోక్యో ఒలంపిక్స్ పై ఉంది. గత ఏడాదే జరగవలసిన ఈ ఒలింపిక్ గేమ్స్ కరోనా కారణం ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతున్నాయి. ఈ ఒలింపిక్ గేమ్స్ లో భాగంగా సుమారు 200 దేశాలు పదివేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ ఒలంపిక్స్ గేమ్స్ కి సంబంధించిన కొన్ని విచిత్ర సంఘటనలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ ఒలింపిక్స్ క్రీడలలో ఓ పిల్లి మాత్రం బాగా ఫేమస్ అయిందని చెప్పవచ్చు టీవీలో ఒలంపిక్స్ గేమ్స్ చేస్తున్నటువంటి పిల్లి వింత చేష్టలు చేయడమే కాకుండా తన దయాగుణాన్ని కూడా బయట పెట్టింది టీవీలో ఒలంపిక్స్ క్రీడలు వస్తున్న నేపథ్యంలో ఓ పిల్లి ఎంతో శ్రద్ధగా ఆ క్రీడలను చూస్తుంది. ఈ క్రమంలోనే పురుష జిమ్నాస్ట్ కడ్డీని పట్టుకొని వేలాడుతూ ట్విర్లింగ్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పిల్లి కూడా తలను గుండ్రంగా తిప్పుతూ చూస్తుంది. మధ్యలో అతడు తిరగడం ఆగిపోతే ఈ పిల్లి టీవీ దగ్గరికి వెళ్లి అతనిని తోయయడానికి ప్రయత్నిస్తోంది.

https://twitter.com/humorandanimals/status/1420434955340025856?s=20

ఈ క్రమంలోనే మరొక జిమ్నాస్ట్ విన్యాసాలు చేస్తుండగా.. ఎక్కడ పడిపోతుందో అని భావించిన పిల్లి చాలాసార్లు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇలా సదరు జిమ్నాస్ట్ పడిపోకుండా ఉండటం కోసం పిల్లి శత విధాలుగా ప్రయత్నించింది.అయితే ఈ పిల్లి వింత చేష్టలు చూస్తున్న కుటుంబసభ్యులకు మాత్రం నవ్వు ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఈ పిల్లలు వింత చేష్టలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now