Viral Video : ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని రైలు ప‌ట్టాల‌పై నిద్ర పోయిన యువ‌తి.. త‌రువాత ఏమైందంటే..?

January 15, 2026 9:13 PM

Viral Video : ఇటీవ‌లి కాలంలో యువ‌త చిన్న చిన్న కార‌ణాల‌కి ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. కాస్త మ‌నస్థాపం చెంద‌డంతో ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్యం అని భావిస్తున్నారు. ఎగ్జామ్ పాస్ కాలేదని, ప్రేమించిన అమ్మాయితొ పెళ్లికాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇంట్లో గొడవలు జరిగాయని, నాన్న తిట్టాడని, అన్నయ్య కొట్టాడని సూసైడ్ లు చేసుకుంటారు. కడుపునొస్తుందని, పెళ్లి ఆలస్యమౌతుందని కూడా ఇటీవల కాలంలో కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆసమయంలో కోపం వల్ల.. కఠినమైన డిసిషన్స్ తీసుకుని, తమ జీవితాల్ని మధ్యలోనే ముగించేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా మంది రైల్వే పట్టాల మీద వెళ్లి సూసైడ్ చేసుకుంటున్నారు.

తాజాగా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. ఆమె ట్రాక్‌ మధ్యలో కూర్చుంది. ట్రైన్ ఎంతకీ రాకపోవడంతో అలాగే నిద్రపోయింది. చివరికి ఓ రైలు రాగా, అందులోని లోకోపైలట్ గమనించడంతో ఆమె ఆత్మహత్య యత్నం విఫలమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీహార్‌లోని చకియా రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. పట్టాల మధ్య అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో అప్రమత్తమైన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు సరిగ్గా ఆమె తల వద్దకు వచ్చి ఆగింది. ఆపై కిందికి దిగిన పైలట్ పట్టాల మధ్య నిద్రపోతున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెను తట్టిలేపాడు. ఏం జరుగుతోందో అర్థం కాని ఆమె ఏడుపు మొదలుపెట్టింది.

Viral Video girl slept on railway track what happened next
Viral Video

ఆపై అక్కడే ఉన్న మహిళలతో ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. తాను రానని ఆమె మొండికేసింది. దీంతో వారు ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ నీకేమొచ్చిందని అడగడం వినిపించింది.ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పిల్లలతో నిత్యం మాట్లాడుతుండాలని ఒకరంటే.. ఏ విషయంలోనైనా పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాకూడదని ఇంకొకరు కామెంట్ చేశారు.అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ యువతిని అదుపులోకి తీసుకుని ఇంటికి చేర్చారు. ఈ ఘటనతో రైలు దాదాపుగా 45నిమిషాలు లేటుగా బయలుదేరింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now