వీడియో వైరల్.. చేపలను తింటున్న మేక.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

September 24, 2021 9:11 PM

సాధారణంగా ప్రకృతి నియమం ప్రకారం కొన్ని జంతువులు మాంసాహారులు కాగా మరికొన్ని శాకాహారులుగా ఉన్నాయి. అయితే శాకాహార జంతువులు ఎప్పటికీ మాంసాహారం ముట్టవు.. అనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా మేకలు ఏ విధమైనటువంటి చెడు పదార్థాలను తినవని అందరికీ తెలుసు. కేవలం ఆకులు, అలములు మాత్రమే తినే మేక చేపలను తింటుందంటే నమ్ముతారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

వీడియో వైరల్.. చేపలను తింటున్న మేక.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎన్నో చిత్ర విచిత్రమైన వీడియోలను మనం చూడగలుగు తున్నాము. ఇలాంటి వాటిలో ఈ వీడియో ఒకటని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మేక చేపలను తింటూ అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

https://youtu.be/3f87QTuB26Y

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక మేకకు గిన్నెలో చేపలు తీసుకువచ్చి పెట్టగా మేక ఒక్కో చేపను తినడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రకృతి విరుద్ధం.. కలియుగమంటూ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now