వీడియో వైరల్.. నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వలవేసి చూడగా షాక్ అయిన స్థానికులు..

September 23, 2021 5:46 PM

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈ క్రమంలోనే వాగులు, వంకలు పొంగి పొర్లడంతో నీళ్లన్నీ రోడ్లపైకి చేరి చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి. ఈ నీటిలో ఎన్నో రకాల పాములు, చేపలు కొట్టుకురావడం మనం చూస్తున్నాం. తాజాగా గుజరాత్ లోని వడోదరలో ఎక్కువగా వర్షాలు పడటంతో వీధులన్నీ జలమయమయ్యాయి. అయితే ఈ నీటిలో ఏదో కదులుతూ ఒక పెద్ద ఆకారాన్ని గుర్తించిన స్థానికులు అది ఏంటని తెలుసుకోవాలని ప్రయత్నించారు. దీంతో వారికి చేదు అనుభవం ఎదురైంది.

వీడియో వైరల్.. నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వలవేసి చూడగా షాక్ అయిన స్థానికులు..

అది ఏంటో తెలుసుకోవాలని కొందరు స్థానికులు వలవేసి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించారు. అయితే అక్కడ నీటిలో కదులుతున్నది ఒక మొసలి అని తెలుసుకోవడంతో ఒక్కసారిగా స్థానికులు ఎంతో భయాందోళనలకు గురయ్యారు. ఆ మొసలి అక్కడే ఉండటం వల్ల ఎంతో ప్రమాదమని ఇద్దరు వ్యక్తులు దైర్యం చేసి వలవేసి దానిని ఎంతో చాకచక్యంగా వలలో చిక్కుకొనేలా చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/CUGObQbFvL3/?utm_source=ig_web_copy_link

ఈ వీడియోను ‘Nature 27_12’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్‌ చేయగా క్షణాల్లో వైరల్ అవుతూ ఎన్నో లైకులు కామెంట్లును సొంతం చేసుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వర్షపు నీటిలో ఇలా ప్రమాదకరమైన జంతువు కొట్టకురావడం స్థానికులను, నెటిజన్లను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment