వీడియో వైరల్: మీ కూతురు చచ్చిపోతుంది.. కాపాడండంటూ వేడుకున్న టిక్ టాక్ స్టార్!

June 26, 2021 8:50 PM

ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ వీడియోలు ఏస్థాయిలో పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే. అయితే
ఈజిప్ట్‌ దేశాల్లో సోషల్‌ మీడియాపై కఠిన ఆంక్షలు ఉంటాయి. ఆ దేశ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం ఏమాత్రం వెనక కాదు. తాజాగా టిక్‌ టాక్‌ స్టార్‌ హనీన్‌ హోసం’కు ఈజిప్టు కోర్ట్‌ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

హనీన్‌ పై ఉన్న మానవ అక్రమ రవాణా కేసులో ఆమెకు ఈజిప్ట్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆమె ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని, కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ శిక్ష నుంచి తనని ఎలాగైనా కాపాడాలని ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ వేడుకుంది. ఈ క్రమంలోనే హనీన్‌ మాట్లాడుతూ…

ప్రెసిడెంట్ సాబ్ మీ కూతురు ఏం పాపం చేసింది.. చచ్చిపోతోంది. చచ్చిపోతున్న మీ కూతుర్ని మీరే కాపాడాలి. ఈ కేసులో నా తప్పు లేదు ఈ కేసును తిరిగి విచారించాలి. నేను జైలుకు వెళ్తే నా తల్లి గుండె ఆగి చచ్చిపోతుంది ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి కాపాడండి అంటూ కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now