వంట గ్యాస్ సిలిండ‌ర్ నుంచి చెల‌రేగిన మంట‌లు.. చాక‌చ‌క్యంగా ఆర్పిన పోలీసు.. వైర‌ల్ వీడియో..!

April 13, 2021 3:10 PM

ఇళ్ల‌లో వంట గ్యాస్ సిలిండ‌ర్ ప్ర‌మాదాలు అనేవి అప్పుడ‌ప్పుడు జ‌రుగుతూనే ఉంటాయి. ఆ ప్రమాదాల్లో ఒక్కోసారి కేవ‌లం ఆస్తి న‌ష్టం మాత్రమే సంభ‌విస్తుంది. కానీ కొన్ని సార్లు ప్రాణాలు పోతుంటాయి. అయితే వంట గ్యాస్ సిలిండ‌ర్‌కు అక‌స్మాత్తుగా మంట‌లు అంటుకుంటే చాలా మందికి ఏం చేయాలో తెలియ‌దు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు పారిపోతారు. కానీ ఆ పోలీస్ ఆఫీస‌ర్ అలాంటి ప‌రిస్థితిలో ఏం చేశాడో చూడండి.

this cop stopped fire skillfully from lpg cylinder

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంభ‌ల్ జిల్లాలో ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండ‌ర్‌కు మంట‌లు అంటుకున్నాయి. ఆల‌స్యం చేస్తే ఆ సిలిండ‌ర్ పేలి ఇల్లంతా మంట‌ల‌కు ద‌గ్ధం అయి ఉండేది. కానీ యోగేంద్ర రాఠీ అన‌బ‌డే ఓ పోలీసు అధికారి అక్క‌డికి స‌మ‌యానికి చేరుకుని ఆ సిలిండ‌ర్ నుంచి వ‌స్తున్న మంట‌ల‌ను ఆర్పేశారు.

ఓ బ‌కెట్‌లో నీటిని తీసుకుని అందులో బ్లాంకెట్‌ను ముంచి పూర్తిగా త‌డిపి అనంత‌రం దాన్ని మంట‌లు మండుతున్న ఆ సిలిండ‌ర్‌పై ఆయ‌న క‌ప్పారు. దీంతో ఒక్క‌సారిగా మంట‌లు ఆరిపోయాయి. ఆ స‌మ‌యంలో ఆ దృశ్యాల‌ను కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ ఇంటిని మంట‌ల‌కు ఆహుతి కాకుండా కాపాడార‌ని ఆయ‌న చూపిన స‌మ‌య‌స్ఫూర్తికి నెటిజ‌న్లు అందరూ ఆయ‌న‌ను మెచ్చుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now