జ‌నాల‌ను ఫూల్స్‌ను చేయ‌బోయాడు.. జైల్లో వేశారు.. వీడియో వైరల్..

August 7, 2021 11:04 AM

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరగడంతో చాలామంది స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు సోషల్ మీడియా వేదికగా ఫ్రాంక్ వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరిగింది.అయితే ఈ ఫ్రాంక్ వీడియో యువకుడికి మాత్రం రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేసింది. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు… అతనికి ఎందుకు జైలు శిక్ష పడింది అనే విషయానికి వస్తే..

మాస్కోలో మెట్రో రైలును ప్రాంక్‌స్టార్‌గా గుర్తింపు పొందిన కరమతుల్లో డిహబోరోవ్‌ రైలు ఎక్కాడు. రైలు ఎక్కిన తర్వాత ఒక భోగిలోకి వెళ్లి ఉన్నఫలంగా దగ్గుతూ కుప్పకూలి కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. మొదట్లో అతను కిందపడగానే అతనికి సహాయం చేయడానికి కొందరు వచ్చినప్పటికీ అతడు విపరీతంగా దగ్గడం చేత అందరు కరోనా భయంతో రైలును ఆపి అక్కడి నుంచి పరుగులు పెట్టారు.

ఈ విధంగా రైలులో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టడంతో డిహబోరోవ్‌ పైకి లేచి ఇది ఫ్రాంక్ వీడియో అని చెప్పడంతో రైలులోని ప్రయాణికులు అతనిపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియో మొత్తం సీసీటీవీలో రికార్డ్ కావడంతో ఈ వీడియో చూసిన అధికారులు ప్రాంక్‌స్టార్‌ డిహబోరోవ్‌ పై కేసును నమోదు చేసి అతనికి రెండు సంవత్సరాలపాటు జైలుశిక్ష విధించారు. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరికి కూడా శిక్ష పడింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now