ఆమె ఆరోగ్యం కోసం.. దేవుడే ఈ రూపంలో వచ్చాడేమో..?

June 26, 2021 8:51 PM

సాధారణంగా మనుషులకు ఉండే ఫీలింగ్స్, ఎమోషన్స్ నోరు లేని మూగ జీవాలకు కూడా ఉంటాయి. అవి నోరు తెరిచి తమలో ఉన్న భావాలను బయటకు వ్యక్తపరిచ లేకపోయినా వాటి ద్వారా తన మనసులో ఉన్న భావాలను బయట పెడుతూ ఉంటాయి.ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఎన్నో విషయాలను గురించి మనం వినే ఉంటాం. తాజాగా అలాంటి సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ జోధ్‌పూర్‌ జిల్లాలోని ఫలోడి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో భన్‌వ్రీ దేవి అనే 90 ఎల్ల వృద్ధ మహిళ నివసిస్తోంది.అయితే గత కొన్ని రోజుల నుంచి ఆమె అనారోగ్యం బారిన పడటంతో మంచానికే పరిమితం అయింది. ఈ క్రమంలోనే ఎక్కడి నుంచో ఒక పెద్ద కొండెంగ ఆ వృద్ధురాలు పడుకున్న మంచం దగ్గరికి వచ్చింది. దానిని చూడగానే కొంత భయపడిన మహిళా తరువాత దాని చేష్టలకు ముగ్ధురాలైంది.

మంచం పై కూర్చున్న కొండెంగ ఎంతో ప్రేమతో ఆ వృద్ధురాలి ముఖంపై ప్రేమగా నిమిరింది.ఆ తర్వాత తన పొట్ట పై పడుకొని ప్రేమగా వృద్ధురాలిని ఆలింగనం చేసుకుంది. మొదట్లో కొండెంగను చూసి భయపడిన వృద్ధురాలు తర్వాత ప్రేమతో దాని తలపై నిమిరింది. కాసేపటికి ఆ కొండెంగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ దేవుడే ఈ రూపంలో తన ఆరోగ్యం నయం చేయడానికి వచ్చాడని కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now