వీడియో వైరల్.. అందరూ చూస్తుండగానే జింకను మింగిన కొండచిలువ..!

September 2, 2021 11:19 AM

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఎన్నో పక్షులకు, జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మనం ఎప్పుడూ చూడని ఆసక్తికరమైన వీడియోలను సోషల్ మీడియా ద్వారా చూడగలుగుతున్నాము. పాము జాతులలో కొండచిలువ ఎంత పెద్దదో మనకు తెలిసిందే. కొండచిలువ చేతికి ఒక్కసారి దొరికామంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి కొండచిలువ అందరూ చూస్తుండగానే ఓ జింకను మింగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో వైరల్.. అందరూ చూస్తుండగానే జింకను మింగిన కొండచిలువ..!

ఆ వీడియోలో కొందరు స్థానికులు అటవీ ప్రాంతంలో ఓ కొండచిలువను పట్టుకున్నారు. ఆ స్థానికులు ఆ కొండచిలువ ముందు ఒక జింక కళేబరాన్ని వేయడంతో కొండచిలువ ఒక్కసారిగా ఆ జింక కళేబరం పై దాడి చేసింది. ఆ కొండచిలువ స్పీడు చూస్తుంటే మాత్రం బాగా ఆకలిగా ఉన్నట్టు కనిపించడంతో దాన్ని చూస్తే మాత్రం ఒకేసారి జింకను మింగేసేలా ఉంది. ఈ క్రమంలోనే ఆ జింక కళేబరాన్ని చూసిన కొండచిలువ ఒక్కసారిగా దానిపై దాడి చేసి దానిని మింగేసింది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now