తప్పుడు హెల్మెట్ పెట్టుకున్నందుకు పోలీసుకే ఫైన్ వేసిన పోలీస్‌.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజ‌న్లు..

October 22, 2022 9:23 PM

ట్రాఫిక్ నిబంధనలను అనుసరించడం మరియు రోడ్లపై  రూల్స్ పాటించండి అని పోలీస్ డిపార్ట్‌మెంట్ పదే పదే ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇది పౌరులకే కాదు, పోలీసు అధికారులందరికీ కూడా వర్తిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే. హెల్మెట్ పెట్టుకోకపోయినా.. సరిగ్గా పెట్టుకోకపోయినా వాహనదారుల నుంచి జరిమానాలు వేసి వాటిని వసూలు చేయడం కామనే.. కానీ కర్ణాటకలోని బెంగళూరులో ఓ పోలీసుకే ఫైన్ పడింది. ట్రాఫిక్ పోలీసులు.. మరో పోలీసుకు జరిమానా విధించారు.

తప్పుడు హెల్మెట్‌ను ధరించినందుకు ఫైన్ వేశారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైరల్ అవుతుంది. గేర్‌లెస్‌ స్కూటర్‌ను నడుపుతూ.. సిటీ రోడ్లలో నిషేధించబడిన హాఫ్ హెల్మెట్ ధరించినందుకు ఒక పోలీసుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. సంబంధిత ఫోటోలను ఆర్టీ నగర్ ట్రాఫిక్ బీటీపీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే దీనిపై నెటిజన్స్ నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి. ఒక యూజర్ అతను చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు.

police fined by police because of wrong helmet netizen praise him

అసలు ట్రాఫిక్ నిర్వహణ ఎలా చేయాలో అది మీ ప్రధాన బాధ్యతగా భావించాలి అని కామెంట్ పెట్టాడు. మరొకరు యూజర్.. సార్ ఇది ఇంకా ఎక్కువ చేయాలి. చాలామంది పోలీసులు హెల్మెట్ లేకుండా వెళ్లడం.. పోలీసులు అలాంటి పోలీసులను వెళ్లనివ్వడం నేను చూస్తున్నాను. అని కామెంట్ పెట్టాడు. ఇంకో యూజర్ నియమాలు అందరికీ ఉంటాయి. ట్రాఫిక్‌ రూల్స్‌ని అనుసరించండి. హెల్మెట్ పెట్టుకోండి అని పెట్టగా.. మరొకరైతే ఇది పబ్లిసిటి స్టంట్ అని వ్యాఖ్యానించారు. పోలీసులు మాత్రం నెటిజన్ల నుంచి ఈ రకమైన మిశ్రమ స్పందనను అస్సలు ఊహించి ఉండరు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now