ఫోటో వైరల్: రూ.1.5 లక్షల బహుమతి గెలుచుకున్న ఫోటో..

June 6, 2021 8:29 PM

భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి తీసిన ఫోటో ప్రపంచంలోని ఎంతో మందిని ఆకట్టుకుంది. కేవలం ఈ ఒక్క ఫోటోనే 1.5 లక్షల రూపాయల బహుమతిని సొంతం చేసుకుంది. అంత పెద్ద బహుమతి గెలుచుకోవడానికి ఆ ఫోటోలో ఏముంది అనుకుంటున్నారా.. అది ఒక కోతి జాతికి చెందిన ఒరాంగూటాన్ ఫోటో . అసలు ఇంత పెద్ద బహుమతి గెలుచుకోవడానికి ఈ ఫోటోలో ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

థామస్ విజయన్ కేరళకు చెందిన ఫొటోగ్రాఫర్. కెనడా వెళ్లి స్థిరపడ్డాడు. అతను బోర్నియో వెళ్లిన సమయంలో ఒక ఒరాంగూటాన్‌ చెట్టు దిగుతున్నటువంటి ఒక ఫోటోను తీశాడు. థామస్ కి ఈ ఫోటోకి ‘ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్‌సైడ్ డౌన్’ అని పేరు పెట్టాడు. థామస్ తీసిన ఈ ఫోటోకి నేచర్ టీటీఎల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే థామస్ 1.5 లక్షల రూపాయల బహుమతిని సొంతం చేసుకున్నాడు.

ఇంత అద్భుతమైన ఫోటోను తీయడం కోసం తామస్ నీటిలో ఉన్నటువంటి ఒక చెట్టును ఎంచుకొని సుమారు గంటల కొద్ది ఆ చెట్టు పై వెయిట్ చేసి ఈ ఫోటో తీసినట్లు తెలిపాడు. ఈ ఫోటో తీయడానికి ఆ నీళ్లు తనకి అద్దంలో పని చేశాయని థామస్ తెలిపాడు. ప్రస్తుతం థామస్ తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now