వీడియో వైరల్ : వామ్మో.. అది తలకాయా ? లేక రుబ్బురోలా ?

June 9, 2021 9:57 PM

సాధారణంగా మన వెనుక ఏదైనా సంఘటన జరుగుతుంది అంటే శరీరాన్ని మొత్తం వెనక తిప్పి అక్కడ జరిగే సంఘటనను చూస్తాము. అయితే గుడ్లగూబలు మాత్రం తన మెడను 360 డిగ్రీస్ లో తిప్పగలవు. అచ్చం గుడ్లగూబ మాదిరిగానే ఓ వ్యక్తి తన తలను 360 డిగ్రీస్ లో కాకుండా 180 డిగ్రీస్ లో తిప్పి తన వెనుక ఏం జరుగుతుందో ఇట్టే గమనిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వ్యక్తి తన మెడను తిప్పే సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విధంగా తలను పూర్తిగా వెనక్కి తిప్పే గుణం మొదటగా గుడ్లగూబకు చెందితే ఆ తర్వాత ఈ వ్యక్తి సొంతం అని చెప్పవచ్చు. అయితే ఈ వ్యక్తి తనంతట తానే తలను వెనక్కి తిప్పకుండా చేతుల సహాయంతో తలను వెనక్కి తిప్పుతాడు.టిక్‌టాక్ యూజర్ @sheaabutt00 పోస్ట్ చేసిన ఇతడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://youtu.be/twSScEDljN0

ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో అది తలనా.. లేకపోతే రుబ్బురోలా ఆ విధంగా తలను తిప్పుతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎవరో కూడా ఇలాంటిది ప్రయత్నించవద్దని, ఇలాంటి సాహసం చేయాలంటే ఎంతో అనుభవం ఉండాలని పలువురు హెచ్చరిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు ఓ లుక్కేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now