వాహ్‌.. అదృష్టం అంటే అతనిదే.. కొద్దిలో తప్పిపోయింది.. లేదంటే చనిపోయి ఉండేవాడు.. బస్సు కింద పడబోయి బతికిపోయాడు.. వైరల్‌ వీడియో..!

September 15, 2021 9:45 PM

ప్రమాదాలు అనేవి చెప్ప జరగవు. అనుకోకుండానే జరుగుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కానీ అలాంటి ఘటనల్లో బతికి బట్టకట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టే బతికిపోయారు.. అని మనం అనుకుంటుంటాం. కొందరు అలా లక్‌ కలసి రావడం వల్ల బతికిపోతుంటారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

వాహ్‌.. అదృష్టం అంటే అతనిదే.. కొద్దిలో తప్పిపోయింది.. లేదంటే చనిపోయి ఉండేవాడు.. బస్సు కింద పడబోయి బతికిపోయాడు.. వైరల్‌ వీడియో..!

గుజరాత్‌లోని దాహోద్‌లో ఉన్న గోధ్రా – ఝాలోద్‌ జాతీయ రహదారిపై ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సును ఓవర్‌ టేక్‌ చేయబోయిన ఓ ద్విచక్ర వాహనదారుడు దానికి ముందుకు వచ్చి ముందు టైర్ల కింద పడ్డాడు. ఈ క్రమంలో బైక్‌ దూరంగా పడిపోయింది. అయితే అతని వేగం బస్సు వేగం కన్నా ఎక్కువ ఉంది. దీంతో బస్సు కింద పడినా అతను టైర్ల కింద నలగలేదు. టైర్లతోపాటు ముందుకు అలాగే వచ్చాడు. దీంతో బస్సు డ్రైవర్‌ సడెన్‌గా బ్రేక్‌ వేశాడు. ఈ క్రమంలో అతను టైర్ల వద్ద ఉండిపోయాడు.

తరువాత అతనే నెమ్మదిగా లేచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇతర వాహనదారులు కొందరు అతని బైక్‌ను తీసి పక్కన పెట్టారు. అయితే అంతటి ప్రమాదం జరిగినప్పటికీ ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాడు. అలాగే లక్‌ కలసి వచ్చింది. లేదంటే టైర్ల కింద నలిగిపోయి ఉండేవాడు.

కాగా అదే సమయంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఈ సంఘటన తాలూకు దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వాహనదారుడు నిజంగా అదృష్టవంతుడేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now