షవర్ కింద వినాయకుడి నిమజ్జనం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

September 21, 2021 11:56 AM

సాధారణంగా వినాయక చవితి ఉత్సవాలు వస్తే వినాయకుడి ప్రతిమలను తొమ్మిది రోజుల పాటు పూజించి అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. అయితే వినాయకుడి విగ్రహాలను చెరువులు, నీటి కుంటలలో నిమజ్జనం చేస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా వినాయకుడి నిమజ్జనం షవర్ కింద చేయడం చూశారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లి హరితవనం కాలనీలో ఈవిధంగా నిమజ్జనం చేశారు.

షవర్ కింద వినాయకుడి నిమజ్జనం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

గత పది సంవత్సరాల నుంచి కాలనీవాసులు కేవలం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ నిమజ్జనాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది భిన్నంగా వినాయకుడి నిమజ్జనం చేయాలని ఉద్దేశించిన వీరు 8.5 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి తొమ్మిది రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని షవర్ కింద ఏర్పాటు చేశారు.

వినాయకుడి విగ్రహ నిమజ్జనం కోసం 50 వేల రూపాయలతో ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేసి దానిపై మోటార్ సహాయంతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన వినాయకుడి నిమజ్జనం మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు పూర్తయింది. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నిజాంపేట్ కార్పొరేటర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం ఈ నిమజ్జనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now