Fake Garlic : బాబోయ్ న‌కిలీ వెల్లుల్లి.. లోపలంతా సిమెంటే.. వీడియో..!

January 15, 2026 9:13 PM

Fake Garlic : ప్ర‌స్తుత త‌రుణంలో మార్కెట్‌లో వస్తున్న వ‌స్తువుల్లో ఏది అస‌లుదో, ఏది న‌కిలీదో గుర్తించ‌డం అత్యంత క‌ష్టంగా మారింది. చాలా మంది వ‌స్తువుల‌కు న‌కిలీల‌ను త‌యారు చేస్తున్నారు. అలాగే ఆహార ప‌దార్థాల‌ను క‌ల్తీ చేస్తున్నారు. క‌ల్తీ అవుతున్న ఆహారాల‌ను తింటున్న ప్ర‌జ‌లు అనారోగ్యం బారిన ప‌డుతున్నారు. క‌ల్తీల‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వాలు ఏం చేస్తున్న‌ప్ప‌టికీ అక్ర‌మార్కులు మాత్రం కొత్త దారుల‌ను వెతుకుతూనే ఉన్నారు. కాదేదీ క‌ల్తీకి అన‌ర్హం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మార్కెట్‌లో న‌కిలీ వెల్లుల్లి క‌ల‌క‌లం రేపుతోంది.

ఇప్ప‌టికే మార్కెట్‌లో అనేక ర‌కాల ఆహారాల‌ను క‌ల్తీ చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వెల్లుల్లి కూడా చేరింది. తాజాగా మ‌హారాష్ట్ర‌లోని అకోలా జిల్లాలో న‌కిలీ వెల్లుల్లి బాగోతం బ‌య‌ట ప‌డింది. ఓ చోట వెల్లుల్లిని కొనుగోలు చేసిన క‌స్ట‌మ‌ర్ దాన్ని తెరిచి చూడ‌గా మొత్తం అందులో సిమెంట్ క‌న‌బ‌డింది. దాన్ని అత‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అది కాస్తా వైర‌ల్‌గా మారింది. దీంతో న‌కిలీ వెల్లుల్లిని చూసిన నెటిజ‌న్లు ఖంగు తింటున్నారు. వెల్లుల్లిని ఇలా కూడా క‌ల్తీ చేస్తారా.. అని షాక‌వుతున్నారు.

Fake Garlic coming in market customers must beware of them
Fake Garlic

అయితే వీటిని ఎవ‌రు త‌యారు చేస్తున్నారు, ఎక్క‌డ ఎలా త‌యారవుతున్నాయి.. అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌రాలేదు. కానీ మార్కెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఈ న‌కిలీ వెల్లుల్లిని చూసి ప్ర‌జ‌లు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లే వెల్లుల్లి ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న నేప‌థ్యంలో ఈ న‌కిలీ వెల్లుల్లి నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలి.. అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే మీరు కూడా వెల్లుల్లిని కొంటే ఎందుకైనా మంచిది ఒక్క‌సారి ఓపెన్ చేసి చూశాకే కొనండి. లేదంటే మోస‌పోతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now