దారుణం.. క‌రోనా సోకిన వారిని ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా త‌లుపుల‌కు మేకులు కొడుతున్నారు.. వీడియో..!

August 10, 2021 4:17 PM

క‌రోనా వైర‌స్ ముందుగా ఎక్క‌డ ఉద్భ‌వించింది.. అని అడిగితే అందుకు ఎవ‌రైనా స‌రే.. చైనా అనే స‌మాధానం చెబుతారు. ఈ విష‌యం ఒక‌ట‌వ త‌ర‌గతి చ‌దివే పిల్ల‌ల‌కు కూడా తెలుస్తుంది. అయితే అంత‌టి భారీ స్థాయిలో అక్క‌డ కేసులు వ‌చ్చినా ఉన్న‌ట్లుండి స‌డెన్ గా కేసులు ఎందుకు సున్నా అయ్యాయి ? అసలు కోవిడ్ ను చైనా ఎలా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగింది ? వంటి ప్ర‌శ్న‌లన్నీ ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉన్నాయి.

china imprisons people in home nails on doors video

ఇక తాజాగా మ‌రోమారు చైనాలో రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇత‌ర దేశాల్లాగే అక్క‌డ కూడా డెల్టా వేరియెంట్ పంజా విసురుతోంది. అయితే క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ చాలా మంది ఇళ్ల నుంచి బ‌య‌టకు వ‌చ్చి య‌థేచ్చ‌గా తిరుగుతున్నార‌ని అక్క‌డి ప్ర‌భుత్వం గుర్తించింది. దీంతో చైనాతోపాటు తైవాన్‌లోనూ అనేక ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌డం లేదు.

https://twitter.com/malau94428928/status/1424721650101022723

కోవిడ్ వ‌చ్చిన వారిని చైనా, తైవాన్ ల‌లో ఇళ్ల‌లోనే బంధిస్తున్నారు. సిబ్బంది పీపీఈ కిట్ల‌ను ధ‌రించి వ‌చ్చి కోవిడ్ బాధితుల ఇళ్ల‌ను మూసేస్తున్నారు. ఇంటి ప్ర‌ధాన ద్వారం తెర‌వ‌కుండా బ‌య‌ట మేకులు కొడుతున్నారు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now