వీడియో వైరల్: కుక్కలా మొరిగిన పక్షి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

August 4, 2021 9:48 AM

సాధారణంగా కొన్ని పక్షులు మనం వాటికి ఎలా ట్రైనింగ్ ఇస్తే అలా చేయడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే కొన్ని పక్షులు కొన్ని రకాల జంతువుల మాదిరి అరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కానీ సీగల్ పక్షి మాత్రం ఈ పక్షుల కంటే ఎంతో భిన్నం. ఈ పక్షి ఎల్లప్పుడు ఒకే రకంగా అరుస్తూ ఉంటుంది. అయితే ఈ పక్షి పక్షి మాదిరి కాకుండా కుక్క మాదిరి అరవడం అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

bird bark like dog viral video
మన దేశంలో మనకు పావురాలు ఎలా ఉంటాయో విదేశాలలో సీగల్ పక్షులు అలాగే ఉంటాయి. ఈ పక్షులు చూడటానికి చాలా అమాయకంగా కనిపించిన ఎన్నో చోరీలను చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్లో ఓ వ్యక్తి బాల్కనీలో కూర్చోగా అతని బాల్కనీలోకి ఒక సీగల్ పక్షి వచ్చింది. ఈ విధంగా పక్షి రావడంతో సదరు వ్యక్తి ఆ పక్షికి వీడియో తీశాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఆ పక్షిని భయపెట్టాలని కుక్క మాదిరి అరిచాడు. కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి కూడా కుక్కలాగా అరవడం మొదలు పెట్టింది.

ఈ విధంగా పక్షి కూడా కుక్కలాగా మొరగడంతో ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన సదరు వ్యక్తి మరోసారి అరిచాడు. ఆ పక్షి కూడా అలాగే అరిచింది.ఈ క్రమంలోనే సదరు వ్యక్తి వేరే విధంగా అరిచినా కూడా సీగల్ మాత్రం కుక్కలా అరవడంతో దాని అరుపే ఈ విధంగా ఉంటుందని భావించాడు. ఈ క్రమంలోనే ఈ సీగల్ పక్షి అరుస్తున్న అరుపుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now