వీడియో వైరల్.. పెళ్లి మండపంపైనే వధూవరుల గిల్లికజ్జాలు.. వరుడు చేసిన పనికి అసహనం వ్యక్తం చేసిన వధువు!

September 3, 2021 11:51 AM

ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ప్లాన్ ప్రకారమే చేసిన సంఘటనలు వైరల్ కాగా మరి కొన్ని అనుకోని సంఘటనల కారణంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా తాజాగా మరొక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వీడియో వైరల్.. పెళ్లి మండపంపైనే వధూవరుల గిల్లికజ్జాలు.. వరుడు చేసిన పనికి అసహనం వ్యక్తం చేసిన వధువు!

సాధారణంగా పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య సరదాలు, అలకలు, కొట్లాటలు మొదలవుతాయి. కానీ ఈ పెళ్లిలో మాత్రం పెళ్లి పూర్తి అవగానే భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాలు మొదలయ్యాయి. ఈ వీడియోలో వధూవరులిద్దరూ స్టేజిపై ఉండగా వరుడు కుర్చీలో దర్జాగా కూర్చుని ఉండగా వధువు నేలపై కూర్చొని ఉంది. ఈ క్రమంలోనే వధువు పక్కనే ఉన్న అరటి పండును తీసుకొని తినబోగా వరుడు ఆమె తినబోయే అరటి పండ్లు తిన్నాడు.

https://www.instagram.com/reel/CNj9N58JLbj/?utm_source=ig_web_copy_link

మొదట్లో పెద్దగా పట్టించుకోని ఆ వధువు రెండోసారి ఒక అరటి పండును తీసుకుంది. వెంటనే ఆ అరటిపండును కూడా వరుడు లాక్కోవడంతో ఒక్కసారిగా వధువు ఆ వరుడి వంక చూస్తూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేరళ వెడ్డింగ్స్ అనే ఇన్ స్టా అకౌంట్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన పలువురు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment