వీడియో వైరల్.. చేతులతో తేనెటీగలను తీసి తేనె పడుతున్న వ్యక్తి..!

August 31, 2021 10:59 PM

సాధారణంగా తేనెను తీసేవారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, శరీరం మొత్తం పూర్తిగా కప్పుకొని తేనెటీగలు కుట్టడానికి ఆస్కారం లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని తేనె పట్టుకోవడానికి వెళ్తారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు తేనెటీగల బారిన పడతారు. ఇక ఎలాంటి జాగ్రత్తలు లేకుండా తేనె కోసం వెళితే తేనెటీగలు మనల్ని చుట్టుముట్టి మనల్ని తీవ్రంగా గాయపరుస్తాయి. కొన్నిసార్లు ఈ ప్రమాదంలో మరణం కూడా సంభవిస్తుంది.

వీడియో వైరల్.. చేతులతో తేనెటీగలను తీసి తేనె పడుతున్న వ్యక్తి..!

కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తేనె పట్టు నుంచి తేనెటీగలను తీసి ఎంతో చాకచక్యంగా తేనెను పట్టుకెళ్ళి పోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతనికి తేనెటీగలు కుట్టలేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఒక ఆకుతో ముందుగా తేనెపట్టు పై రెండు సార్లు అటు ఇటు ఊపగా, అక్కడ ఉన్న తేనెటీగలు వెళ్ళిపోయాయి. మరికొన్నింటిని స్వయానా తన చేతితో పట్టుకొని తీసివేశాడు.

Extracting Honey from a Beehive
byu/iltifaat_yousuf inoddlysatisfying

కత్తి సహాయంతో సగం తేనె పట్టు కట్ చేయగా మిగిలిన సగం తేనెను ఒక బకెట్ లోకి పట్టుకున్నాడు. ఆ తర్వాత ముందుగా కట్ చేసిన ఆ తేనెపట్టును రాతికి అతికించాడు. ఇలా చేయగా అక్కడ ఉన్న తేనెటీగలు మరి వచ్చి తేనెపట్టుపై వాలిపోయాయి. అయితే ఆ వ్యక్తికి తేనెటీగలు కుట్టకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now