వావ్ ఏం నటన గురూ..నీ నటనకు ఆస్కార్ ఇవ్వాల్సిందే.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

April 19, 2021 12:17 PM

సాధారణంగా మనం కొందరు చేసే నటనని, పనులను చూస్తే వారిపై ప్రశంసలు కురిపిస్తాము. నటన ఇరగదీసాడని, సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అంటూ ఎన్నో సలహాలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఓ సాధారణ వ్యక్తి పై నెటిజన్లు అందరూ ఏం నటన గురూ.. ఇరగదీసావ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడో ఇక్కడ తెలుసుకుందాం..

రోడ్డుపై ఒక స్కూటీ లో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే ఆ ముగ్గురికి మాస్కులు లేవు, హెల్మెట్ లేదు.స్కూటీలో ప్రయాణిస్తున్న వారు వారికి ఎదురుగా పోలీస్ వాహనం రావడం గమనించి స్కూటీ ని వెనక్కి తిప్పారు. ముగ్గురు ఉంటే కేస్ అవుతుందని భావించి అందులో ఒక వ్యక్తి దిగి స్కూటీకి తనకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిగా జోబులో నుంచి మాస్కు తీసి పెట్టుకొని రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఆ పోలీస్ వ్యాన్ అటుగా అతని దగ్గరకు వచ్చి ఆపి ఏదో సమాచారం అడగడంతో అతను ఏమీ తెలియనట్టు వారికి సమాధానం చెప్పాడు. అయితే ఈ తతంగమంతా సీసీ కెమెరాలలో రికార్డ్ కాగా అసలు విషయం బయటపడింది. ఈ వీడియోను కేరళ పోలీసులు ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఇతనికి ఆస్కార్ ఇవ్వొచ్చు, నీ నటన సూపర్ అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంత అద్భుతమైన ఫన్నీ వీడియోను మీరు ఓ లుక్కేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now