వామ్మో.. ఒక్క టమాటా చెట్టుకు 839 పండ్లు.. ఎలా సాధ్యమైందంటే ?

September 22, 2021 1:58 PM

సాధారణంగా మనం ఒక టమాటా చెట్టుకు ఐదారు కిలోల టమాటా పండ్లు కాయడం చూస్తుంటాము. కానీ మీరు ఎప్పుడైనా ఒక టమాటా చెట్టుకు ఏకంగా వందల కిలోల కొద్దీ టమాటా పండ్లు కాయడం చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంగ్లాండ్‌కు చెందిన డగ్లస్ స్మిత్ అనే వ్యక్తి ఒక టమాటా చెట్టుకు ఏకంగా 830 9 కిలోల టమాటాలను పండించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. ఇది ఎలా సాధ్యమైందనే విషయానికి వస్తే..

వామ్మో.. ఒక్క టమాటా చెట్టుకు 839 పండ్లు.. ఎలా సాధ్యమైందంటే ?

అమిత్ పండించిన టమాటా సాధారణ టమాటా కాదు.. ఇవి చెర్రీ టమోటో రకానికి చెందినవి. ఈ టమాటా అచ్చం చెర్రీ పండ్ల మాదిరిగానే రుచిని కలిగి ఉండటం వల్ల వీటిని స్నాక్స్ తయారుచేయడంలో కూడా ఉపయోగిస్తారు. స్మిత్ ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నప్పటికీ అతనికి పండ్ల మొక్కలను పెంచడం ఉన్న ఇష్టంతో ఈ విధమైనటువంటి కొత్త రకానికి చెందిన పనులపై దృష్టి సారించాడు.

ఈ క్రమంలోనే చెర్రీ రకానికి చెందిన టమాటాలను సాగు చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కిందని తాజాగా స్మిత్ ట్వీట్ చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు గ్రాహం టాంటర్ అనే వ్యక్తి పేరుతో ఉంది. అతడు 2010 లో ఓకే కొమ్మకు ఏకంగా 448 టమాటాలను పండించి గిన్నిస్ వరల్డ్ రికార్డును దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం అతని స్థానంలో స్మిత్ చోటు దక్కించుకున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now