ప్రేయసీ ప్రియుల మధ్యలోకి ఎవరైనా వస్తే వారికి ఇక బడితె పూజ తప్పదు. అనవసరంగా జంటలు లేదా దంపతుల మధ్య ఎవరూ కలగజేసుకోకూడదు. వారి మానాన గొడవపడి వారే పోతారు. అయితే అక్కడ జరిగింది వేరే. ఒక బాయ్ ఫ్రెండ్ కోసం ఏకంగా నలుగురు యువతులు తన్నుకున్నారు. మధ్యలో అడ్డువచ్చిన ఇంకో యువకునిపై వారు చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీహార్‌లోని ముజఫర్ పూర్ సిటీలో ఉన్న మోతిజ్‌హీల్ ప్రాంతంలోని ఒక మాల్‌లో ఇద్దరు యువతులు ఒక బాయ్ ఫ్రెండ్ కోసం తన్నుకోవడం మొదలు పెట్టారు. అయితే ఇంకో యువతి వచ్చి వారితో గలాటాకు దిగింది. దీంతో ఇద్దరి పొట్లాట కాస్తా ముగ్గురి మధ్య జరిగింది. అనంతరం ఇంకో యువతి వచ్చి అందులో చేరింది. దీంతో మొత్తం నలుగురు యువతులు ఒకే ఒక బాయ్ ఫ్రెండ్ కోసం తన్నుకున్నారు.
అయితే ఓ వ్యక్తి వారిని వారించబోయాడు. కానీ అతను కూడా వారిచే దెబ్బలు తినాల్సి వచ్చింది. అయితే చివరకు మాల్ సెక్యూరిటీ సిబ్బంది వారిపై ఆగ్రహించి అక్కడి నుంచి వారిని పంపించేశారు. కానీ పోలీసులు మాత్రం తమకు ఈ సంఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. అయితే అక్కడ ఉన్నవారంతా ఈ గొడవ తాలూకు ఫొటోలు, వీడియోలను చిత్రీకరించారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…